నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో ప్యారడైజ్-బేగంపేట మార్గంలో మెట్రో రైళ్ల వైర్లపై ఫ్లెక్సీలు పడ్డాయి. గాలులకు ఎగిరివచ్చిన ఫ్లెక్సీలు తీగలపై పడటంతో దాదాపు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి.