బీజేపీ ఫ్లెక్సీలు.. ఊహించని షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ | GHMC Fines For BJP And TRS Flexi In Hyderabad | Sakshi
Sakshi News home page

బీజేపీ ఫ్లెక్సీలు.. ఊహించని షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ

Published Sun, Jul 3 2022 11:44 AM | Last Updated on Sun, Jul 3 2022 11:55 AM

GHMC Fines For BJP And TRS Flexi In Hyderabad - Sakshi

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వాడివేడీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. పార్టీ నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తీవ్ర విమర్శ గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ప్రధాని మోదీ సభపైనే అందరి దృష్టి ఉంది. 

ఇక, తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. భారీ సంఖ‍్యలో బీజేపీ నేతలకు జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు రూ. 20 లక్షల వరకు జరిమానా విధించినట్టు సమాచారం. 

అయితే, బీజేపీ ఫ్లెక్సీలకు ట్విట్టర్‌ వేదికగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే జరిమానాలు విధించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అలాగే, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఫ్లెక్సీలకు సైతం దాదాపు రూ. 3 లక్షల వరకు జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం వచ్చిన ఫిర్యాదులపై రేపు(సోమవారం) జరిమానాలు విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement