
గుంటూరు: మాచవరం మండలం మోర్జంపాడులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మోర్జంపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గ్రామంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు రుచించలేదు.
కేవలం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment