
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు పట్టాలపై ఒక వైపు నుంచి మరో వైపునకు దాటే ప్రయాణికులపై మెట్రో యాక్ట్ ప్రకారం రూ.500 జరిమానా, ఆరునెలల జైలుశిక్ష తప్పదని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగినందున పట్టాలను నేరుగా దాటేవారు ప్రమాదాల బారిన పడతారని ఆయన హెచ్చరించారు. ఇటీవల కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద కొందరు మెట్రో పట్టాలపై ఒక వైపు నుంచి మరోవైపునకు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్లాట్‌ఫారంపై ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లాలనుకునేవారు మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి మధ్యభాగం(కాన్‌కోర్స్)కు చేరిన తర్వాతే మరో వైపునకు మారాలని సూచించారు. పలు మెట్రో నగరాల్లో పట్టాలు దాటుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment