సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో నగరంలోని మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఆదివారం ప్రయాణికులతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సులు తిరగకపోవడం, ప్రైవేటు వాహనాల్లో భారీగా చార్జీలు వసూలు చేస్తుండటంతో నగరవాసులు మెట్రోరైలుపై పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 11.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ మెట్రో నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment