
హైదరాబాద్‌లో మెట్రోరైలు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రో లైన్ సేవల ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్- అమీర్‌పేట్ మెట్రో లైన్ ఈ జూన్‌లో ప్రారంభం కాదన్నారు. సీటీఎస్ టెక్నాలజీతో ఈ ఆగస్టులో ఈ ఆ మెట్రో లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో లైన్‌ను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు మెట్రోరైలు ఎండీ వివరించారు.
అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు కొనసాగుతున్న మెట్రోరైలు వేగం బాగానే ఉందన్నారు. అయితే మెట్టుడూడ నుంచి అమీర్‌పేట్ వరకు సీబీటీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో మెట్రో వేగం ఈ మార్గంలో కాస్త తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ప్రతిరోజూ 60 వేల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment