సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్ నగర్‌కు చెందిన స్వప్న అనే గృహిణి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్వప్న చెయి విరగడంతో పాటు.. స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment