Victoria Memorial
-
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్‌పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన గృహిణి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్ నగర్‌కు చెందిన స్వప్న అనే గృహిణి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్వప్న చెయి విరగడంతో పాటు.. స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ భూమి రూపురేఖలు మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిచ్చిన విక్టోరియా మోమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ సంబంధిత భూమి రూపు రేఖలు మార్చొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిలో చదును చేయడం, చెట్లు కొట్టేయడం చేయొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని అదనపు ఏజీ (ఏఏజీ) హామీ ఇవ్వడంతో దాన్ని నమోదు చేసుకుని విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విక్టోరియా మెమోరియల్‌కు చెందిన 10 ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయగా, వాటిని సవాల్ చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్. బుచ్చిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. శుక్రవారం మరోసారి విచారించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ సిద్ధం చేశామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి అభ్యంతరం తెలిపారు. లీజుకు తీసుకున్న భూమిలోని చెట్లను కొట్టేస్తున్నారంటూ నరికివేతకు సంబంధించిన ఫొటోలను ధర్మాçసనం ముందుంచారు. లీజుకిచ్చిన భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ భూమిపై ప్రభుత్వానికి హక్కుం డదన్నారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం.. చెట్లు ఎందుకు నరికేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రామ చంద్రరావు బదులిస్తూ, లీజుకిచ్చిన భూమి దేవాదాయ భూమేనని అంగీకరించారు. లీజు ఒప్పందం చేసుకోవడా నికి దేవాదాయ శాఖ అనుమతిచ్చిందని, ఒప్పందం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. 69 ఎకరాల్లో కమిషనరేట్‌ను నిర్మించనున్నామని వివరించారు. -
‘అనాథాశ్రమాన్ని పోలీస్‌కమిషనరేట్‌గా మార్చొద్దు’
ఎన్నో ఏళ్లుగా ఆనాథలకు నీడ నిస్తున్న సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథ గృహాన్ని పోలీసు కమిషనరేట్‌గా మార్చాలన్న ఆలోచనను విరమించుకోవాలని బాలలహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. నైజాం హయాంలో ఖానాగా పిలువబడే ఈ విక్టోరియా మెమోరియల్ సంస్థను అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ సందర్శించారని తెలిపారు. కోల్‌కతాలో ఉన్న విక్టోరియా మహల్ రూపంలో ఈ నిర్మాణం ఉండాలని ఆకాంక్షించిన ఆయన ప్రస్తుతం విక్టోరియా మెమోరియల్ హోంను నిర్మించి పిల్లలకు చెందేలా నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. విక్టోరియా మెమోరియల్ హోంలో మొత్తం 94ఎకరాలు ఉండగా మధ్యలో రహదారివెళ్లడం, మరి కొంత స్థలం అన్యాక్రాంతం కావడం, మరి కొంత స్థలం ప్రభుత్వాలే ప్రైై వేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంతో కేవలం 64ఎకరాల స్థలం మిగిలిందని ఆమె వివరించారు. దీనిని కూడా పిల్లలకు దక్కకుండా చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు ఇవ్వచూపడంపై బాలల హక్కుల సంఘం తరఫున తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ హోమ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకే చెందాలని... ప్రభుత్వం కమిషనరేట్‌కు ఇవ్వాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఆందోళన చేపడుతామని ఆమె హెచ్చరించారు.