సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు సేవలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైలు సర్వీసును ప్రారంభించారు. మొదటి రోజు కావడంతో ఇందులో ప్రయాణించేందుకు భాగ్యనగర వాసులు అమితాసక్తి చూపారు. అయితే టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది.
టిక్కెట్లు ధరలు ఇలా..
ఎల్బీనగర్-మియాపూర్ రూ. 60
ఎల్బీనగర్-అమీర్‌పేట రూ. 45
ఎల్బీనగర్- ఖైరతాబాద్, నాంపల్లి రూ. 40
ఎల్బీనగర్- గాంధీభవన్, ఎంజీబీఎస్ 35
ఎల్బీనగర్- మలక్‌పేట రూ. 30
ఎల్బీనగర్- దిల్‌షుఖ్‌నగర్ రూ. 25
Comments
Please login to add a commentAdd a comment