Paytm Payments Bank Launches Paytm Transit Card: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్ధ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ‘వన్‌నేషన్-వన్ కార్డ్’ అనే నినాదంతో పేటీఎం ట్రాన్సిట్‌కార్డును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించింది. ఈ ట్రాన్సిట్ కార్డుతో మెట్రో, రైల్వేలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో, మర్చంట్ స్టోర్‌లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉపయోగించవచ్చునని పేర్కొంది. దాంతో పాటుగా ట్రాన్సిట్ కార్డు సహాయంతో ఏటీఎం నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించనుంది.
ట్రాన్సిట్ కార్డు పేటీఎం వ్యాలెట్‌తో నేరుగా లింక్ చేయబడి ఉండనుంది. బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకుగాను పేటీఎం ట్రాన్సిట్ కార్డును లాంచ్ చేసినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్డును పేటీఎం యాప్‌లో అప్లై చేసుకున్న యూజర్లకు ఇంటికే డెలివరీ చేయనుంది.
పేటీఎం ప్రకటన ప్రకారం..పేటీఎం ట్రాన్సిట్ కార్డ్‌ను దేశవ్యాప్తంగా మెట్రోలతో పాటు ఇతర మెట్రో స్టేషన్‌లలో ఉపయోగించవచ్చునని పేర్కొంది. ఈ కార్డ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ , అహ్మదాబాద్ మెట్రో లైన్లలో పనిచేస్తోంది. హైదరాబాద్ మెట్రోరైల్‌లో కూడా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ఉపయోగించే అవకాశం కల్పించనుంది.పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ సహయంతో ఒకే కార్డుతో అన్ని పనులు చేసుకోగలుగుతారని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో సతీష్ గుప్తా తెలిపారు.
చదవండి: రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..!
Comments
Please login to add a commentAdd a comment