ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చింది. ఈ పరికరాలు మేడ్‌ఇన్‌ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది.
ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆడియో డివైజ్‌ల బ్యాటరీ లైఫ్ 10 రోజులుంటుందని చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళంతో సహా 11 భాషల్లో నోటిఫికేషన్‌లను అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
సౌండ్‌బాక్స్‌లు లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో పేటీఎం వ్యవస్థాపకులు, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ..‘కొత్త సౌండ్‌బాక్స్‌లు భారతదేశంలోనే తయారు చేశాం. ఇవి స్పష్టమైన సౌండ్‌ను అందిస్తాయి. భారతీయ పరిస్థితులకు ఇవి బాగా సరిపోతాయి. అధిక శబ్దం వచ్చే పరిస్థితుల్లోనూ పేటీఎం కస్టమర్లకు స్పష్టమైన నోటిఫికేషన్‌ను అందిస్తాయి’ అన్నారు.
ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రద్దు చేసిన తర్వాత యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేల కోసం ప్రయత్నించింది. పేటీఎం వినియోదారులకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (పీఎస్‌పీ) బ్యాంక్ హ్యాండిల్స్‌ను మార్చారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్‌లతో పేటీఎం పీఎస్‌పీను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 17న ఈ పీఎస్‌పీ బ్యాంకులకు కస్టమర్ మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment