హైదరాబాద్ : నగరంలోని మెట్రో ప్రయాణికులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. ఉదయం పూట కావడంతో మెట్రోలో జనాలు అధికంగా ఉన్నారు. మెట్రో ట్రాక్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా సమాచారం. మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో పలువురు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment