
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్–హైటెక్ సిటీ (10 కి.మీ)మార్గంలో మార్చి మూడో వారంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గంలో కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ అధికారుల బృందం భద్రత పరీక్షలు నిర్వహిస్తోంది. సుమారు 18 రకాల పరీక్షలు కీలకదశకు చేరుకున్నట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లకు ప్రధానంగా లోడ్, స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్ తదితర అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మెట్రో రైళ్ల ఆలస్యం..
ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో బుధవారం విద్యుత్ సంబంధ అంతరాయాల కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఒక చివరి నుంచి మరో చివరకు 52 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా..75 నిమిషాలు పట్టినట్లు ప్రయాణికులు వాపోయారు. పలు స్టేషన్లలో నిమిషానికి పైగా రైళ్లను నిలిపారు. రైళ్ల ఆలస్యం సర్వసాధారణమేనని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో వర్గాలు స్పష్టం చేశాయి. కాగా నిత్యం ఈ రూట్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment