
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్‌పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో వద్ద ఉన్న మైండ్ స్పేస్ టవర్‌లో 13వ ఫ్లోర్ నుంచి దూకి టెకీ వంగ నవీన్ రెడ్డి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment