Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. సిటీలో కోహ్లి రెస్టారెంట్‌ | Sakshi
Sakshi News home page

Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. సిటీలో కోహ్లి రెస్టారెంట్‌

Published Thu, May 23 2024 4:44 PM

Virat Kohli's One8 Commune Restaurant Opened In Hyderabad

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. వన్‌ 8 కమ్యూన్‌ పేరిట రెస్టారెంట్‌ చైన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్‌ 8 కమ్యూన్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

కోహ్లికి హైదరాబాద్‌ అంటే కూడా చాలా ఇష్టం
నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్‌ 8 కమ్యూన్‌లో కోహ్లి భాగస్వామి వర్తిక్‌ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశాం.

అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్‌ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్‌ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! 

ఇక్కడి ఫుడ్‌, సిటీ వైబ్‌.. అన్నీ తను చాలా ఎంజాయ్‌ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్‌ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.

అతడి ఫేవరెట్‌ డిష్‌ ఇదే
అదే విధంగా.. గ్లోబల్‌ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్‌ ఎంజాయ్‌ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్‌ తిహారా పేర్కొన్నారు.

ఇక విరాట్‌ కోహ్లి వెజిటేరియన్‌ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్‌ డిమ్‌సమ్ అతడి ఫేవరెట్‌ డిష్‌ అని తెలిపారు. పాన్‌ ఇండియా లెవల్లో‌ అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్‌మెషీన్‌ కోహ్లి ఫిట్‌నెస్‌, డైట్‌ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.

భోజనం బాగుందంటూ కితాబులు
ఇదిలా ఉంటే.. వన్‌ 8 కమ్యూన్‌ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇప్పటికే కింగ్‌ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఫుడ్‌, పార్టీ ప్లేస్‌ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.

చదవండి: విరాట్‌ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్‌ స్టార్‌
 

Advertisement
 
Advertisement
 
Advertisement