అతిగా మద్యం సేవించి మెట్రో రైళ్లలో న్యూసెన్స్ చేసే మందుబాబులకు చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8న తార్నాక మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి రైలులో తన మొబైల్‌లో పాట పెట్టి విపరీతంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. వారు దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి మెట్రో అధికారులకు చేరవేయడంతో సిబ్బంది అతణ్ని కిందికి దించేశారని తెలిపారు.