
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న జేసీ రవీందర్‌రెడ్డి
నవీపేట(బోధన్): పట్టాపాస్‌పుస్తకాల త యారీలో ఎ లాంటి తప్పు లు దొర్లకుండా చూసుకోవాల ని జిల్లా జా యింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. స బ్ రిజిస్ట్రార్ కార్యాల య ఏర్పాటులో భాగంగా నవీపేట తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 11న నూతన పట్టాపాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. మార్చి 12న తహసీల్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తహసీల్ కార్యాలయాలను పరిశీలిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేని చోట అదనపు భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవీపేటలో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. జేసీ వెంట ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్ అనిల్‌కుమార్‌లున్నారు.
ఎడపల్లిలో స్థల పరిశీలన..
ఎడపల్లి(బో«ధన్): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. తహసీల్ కార్యాలయం ఎదుట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ లతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి డీఆర్‌వో, ఆర్డీవో వినోద్‌కుమార్ ఉన్నారు.