హైదరాబాద్ : కల్తీ పాలపై బుధవారం తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో విపక్ష సభ్యులు కల్తీపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీపాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పశువుల నుంచి పాలు త్వరగా తీసేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్నారని, దీనివల్ల దుష్ప్రరిణామాలు ఉన్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. మరోవైపు రైతులు...వెటర్నరీ సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వెటర్నరీ శాఖలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం తక్షణమే భర్తి చేయాలన్నారు. గోపాల మిత్ర వేతం రూ.3,500 నుంచి 2,500లకు తగ్గించారని, దీనివల్ల గోపాల మిత్రల సేవలు సరిగా అందించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీపాల నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య దృష్ట్యా వైద్యులు తనను పాలు తాగాలని సూచించినా...కల్తీ భయంతో పాలు కూడా తాగటం లేదన్నారు. సభ్యుల ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇస్తూ కల్తీపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.
కల్తీ పాలపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
Published Wed, Nov 12 2014 10:59 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement