AP: వర్రా రవీంద్రారెడ్డి పిటిషన్‌.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు | Ap High Court Orders To Police In Varra Ravindar Reddy Petition | Sakshi
Sakshi News home page

AP: వర్రా రవీంద్రారెడ్డి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

Published Wed, Nov 20 2024 6:57 PM | Last Updated on Wed, Nov 20 2024 7:37 PM

Ap High Court Orders To Police In Varra Ravindar Reddy Petition

సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీం‌ద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం(నవంబర్‌ 20) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.చట్టనిబంధనలు,కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రవీం‌ద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 29కి వాయిదా వేసింది.

హైకోర్టులో వర్రా రవీంద్రారెడ్డి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు..

  • ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించింది
  • ఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలి
  • నిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పు ఇచ్చింది
  • వర్రా రవీం‌ద్రారెడ్డి  రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు
  • కోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారు
  • రవీం‌ద్రారెడ్డి  హైకోర్టు ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరు పరిచారు
  • 24 గంటల్లో వర్రా రవీం‌ద్రారెడ్డి  రెడ్డిని కోర్టులో హాజరపరచాల్సిన పోలీసులు 48 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు
  • రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఇలానే వ్యవహరిస్తున్నారు
  • చట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్న హెచ్చరికలు పోలీసులకు పంపాల్సిన సమయం ఆసన్నమైంది
  • రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారు
  • అధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు
  • ఇవేవీ పోలీసులకు కనిపించడం లేదు
  • వారి జోలికి వెళ్లే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదు
  • కొంతమంది పోలీసులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement