వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు తెర తీశారు.అయోవా ప్రైమరీ బ్యాలెట్‌లో విజయం సాధించి ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాలేపై ట్రంప్ తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.
నిక్కీపై ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో అనుచిత పోస్టులు పెట్టారు. నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం లేదని, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆమె పేరులోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీ ఎక్స్‌లో ధీటైన సమాధానమిచ్చారు.
‘ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు అభద్రతాభావం,భయానికి గురైనపుడు ట్రంప్ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారు. ఈ విషయంపై దృష్టి పెట్టి నా శక్తిని నేను వృథా చేసుకోను’అని హాలే పోస్టు చేశారు. గతంలో ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు కూడా ఆయన అమెరికన్ కాదని జాతి వివక్ష ప్రచారాన్ని ట్రంప్ విస్తృతంగా నిర్వహించారు. ఈ నెల 15న జరిగిన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా రన్నరప్‌గా నిలిచిన డిశాంటిస్ ట్రంప్ దరిదాపుల్లో కూడా లేరు. నిక్కీ డిశాంటిస్ కన్నా వెనుకబడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment