అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అయితే నెవడా రాష్ట్రంలో ట్రంప్‌కు గట్టిపోటి ఇస్తున్న మరో నేత నిక్కీ హేలీ పోటీకి దూరంగా ఉండటంతో ట్రంప్ గెలుపొందారు. తాజాగా ట్రంప్ చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ప్రచారంలో నిక్కీ హేలీ భర్త కనించడం లేదు? ఆయన ఎక్కడ? ఆయనకు ఏమైంది? అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిక్కీ హేలీ స్పందించారు.
ఇలాంటీ ప్రశ్నలు ప్రత్యక్షంగా డిబేట్‌లో పాల్గొన్నప్పుడు అడగాలని.. కానీ ఇలా తన వెనకాల ప్రచారంలో విమర్శ ఏంటని ట్రంప్‌పై మండిపడ్డారు. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే.. సూటిగా చెప్పాలి. కానీ.. వెనకాల విమర్శలు చేయోద్దు. స్టేజ్ మీదకు వచ్చి డిబేట్‌లో నా ముందు మాట్లాడాలి’ నిక్కీ హేలీ దుయ్యబట్టారు.
‘నా భర్త మైఖేల్ దేశానికి సేవలు అందించారు. దాని గురించి నీకు ఏం తెలియదు(డొనాల్డ్). మైకేల్ సేవలకు నేను గర్విస్తున్నా. ప్రతి మిలిటరీ కుటుంబానికి తెలుసు మిలిటరీలో పనిచేసినవారి త్యాగం గురించి. మిలిటరీ బలగాల త్యాగం తెలియని వాళ్లు అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించే అర్హత ట్రంప్‌కు లేదు. మిలిటరీ బలగాల త్యాగాలను కించపరిచే వ్యక్తి (డొనాల్డ్ ట్రంప్) మిలిటరీ డ్రైవర్ లైసెన్స్ పొందడానికి కూడా అర్హుడు కాదు’ అని భారత సంతతి మహిళా నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నిక్కీహేలీ భర్త మైఖేల్ హేలీ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘ఇదే మనుషులు, జంతువుల మధ్య తేడా?జంతువులు ఎప్పుడూ మూగ జంతువుకు సారథ్యం వహించడానికి అనుమతి ఇవ్వవు’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment