'అలాంటి అవకాశమే లేదు'
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సౌత్ కరోలినా ఇండియన్-అమెరికన్ గవర్నర్ నిక్కీ హేలీ తోసిపుచ్చారు. రిపబ్లిక్ పార్టీ తరపున ఆమెకు ఉపాధ్యక్ష పదవి లభించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అలాంటి అవకాశమే లేదని ఆమె కొట్టిపారేశారు.
'నా ప్లేటు ఫుల్ గా ఉంది. గవర్నర్ బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నా కుమార్తె వచ్చే ఏడాది కాలేజీలో చేరబెతోంది. నా కుమారుడు స్కూల్ మధ్యలో ఉన్నాడు. నేను ఎంతో ఇష్టపడే రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ'ని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికాకు గొప్ప వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారని 44 ఏళ్ల హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న ఫ్లోరిడా సెనేటర్ మార్ కో రుబియోకు ఆమె మద్దతు ప్రకటించారు.