‘యాప్‌ల బ్యాన్‌ అభినందనీయం’ | Nikki Haley on India Banning 59 Popular Chinese Apps | Sakshi
Sakshi News home page

చైనా యాప్‌ల బ్యాన్‌ను ప్రశంసించిన నిక్కీహేలీ

Published Thu, Jul 2 2020 1:34 PM | Last Updated on Thu, Jul 2 2020 1:36 PM

Nikki Haley on India Banning 59 Popular Chinese Apps - Sakshi

వాషింగ్టన్‌: గల్వాన్‌ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో భారత్‌ టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రశంసించారు. చైనా దూకుడుకు భారత్‌ భయపడలేదని తెలిపారు. ఈ క్రమంలో నిక్కీహేలీ ‘టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం అభినందనీయం. చైనా దూకుడుకు భారత్‌ భయపడలేదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

దేశ సార్వ‌భౌమాధికారానికి, ఐక్య‌త‌కు, భ‌ద్ర‌త‌కు చైనా యాప్‌ల‌తో ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆ దేశ యాప్‌ల‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.  ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో కూడా సమర్థించారు. చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని.. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. (టిక్‌టాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement