చైనాకు చెందిన ఫ్యాషన్ దుస్తుల దిగ్గజం షీఇన్ (Shein) భారత్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు గల్వాన్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన యాప్స్, సంస్థలపై నిషేధం విధించింది. వాటిలో షీఇన్ సంస్థ సైతం ఉంది.
షీఇన్ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్, యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది.
అయితే, భారత్ షీఇన్ విభాగం దేశీయంగా ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుంది. ఈ ఒప్పందం తర్వాత దేశీయంగా చైనా కంపెనీ తన కార్యకలాపాల్ని పున:ప్రారంభించనుందని.. ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
షీఇన్‌పై రీటైల్ చూపు
రీటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రీటైల్ భారత్ నిషేధం విధించిన షీఇన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. 25,000 చిన్న మరియు మధ్య తరహా స్థానిక ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేసి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది. ఈ సంస్థను దక్కించుకుంటే ఫ్యాషన్ విభాగంలో మరింత వృద్ది సాధించవచ్చని రిలయన్స్ భావించింది. అందుకే ఆ సంస్థను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా షీఇన్ బ్రాండెడ్ ఉత్పత్తుల్ని అమ్మే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
పెరగనున్న మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాటా
కానీ రిలయన్స్ షిఇన్‌ను కొనుగోలు చేయకుండా.. ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో షీఇన్ తన ప్లాట్‌ఫారమ్‌లో మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఒప్పందం, పున ప్రారంభం వంటి అంశాలపై ఇటు షీన్ ప్రతినిధులు, అటు రిలయన్స్ ఇతర వివరాల్ని వెల్లడించలేదు.
నిషేధించబడిన యాప్‌లు
గాల్వాన్ ఘర్షణలనేపథ్యంలో 2020లో భారత్ నిషేధించిన చైనీస్ యాప్‌లలో షీన్ కూడా ఒకటి. చైనాలో తన దుస్తులను విక్రయించని షీన్ 2021లో దాని ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌కు మార్చింది. షీన్ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంతా భారత్‌లో స్టోర్ అవుతుంది. డేటా భద్రతా సమస్యలపై భారత ప్రభుత్వ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్ రిటైలర్ (షీఇన్)కు అందుబాటులో ఉండదు. స్టాక్ మార్కెట్‌తో ప్రమేయం లేనందున షీఇన్‌కు రిలయన్స్ సంస్థ లైసెన్స్ రుసుముల్ని చెల్లించనుంది.
రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment