వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న భారతీయ అభ్యర్థి వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఆ తర్వాత క్రమ క్రమంగా పాయింట్లను పెంచుకుంటూ వచ్చారు.
ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా అప్పటి వరకు రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రాధమిక పోలింగ్‌లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అతని పనితీరు కాస్త వెనకబడి ఉంది.
ఇదిలా ఉండగా ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వచ్చారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి మాజీ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ విషయానికి వస్తే జులైలో 26 శాతం మద్దతుతో ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు 6 శాతానికి పడిపోయారు.
In a just released CNN-University of New Hampshire poll, DeSantis has dropped 13 points since July's survey. He's now at 10% among likely GOP primary voters, while Vivek Ramaswamy is at 13%, Nikki Haley at 12% and Chris Christie is at 11%. Trump is the first choice at 39%.
— Kaitlan Collins (@kaitlancollins) September 20, 2023
ఇది కూడా చదవండి: తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం
Comments
Please login to add a commentAdd a comment