presidential candidates
-
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న భారతీయ అభ్యర్థి వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఆ తర్వాత క్రమ క్రమంగా పాయింట్లను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా అప్పటి వరకు రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రాధమిక పోలింగ్‌లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అతని పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వచ్చారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి మాజీ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ విషయానికి వస్తే జులైలో 26 శాతం మద్దతుతో ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు 6 శాతానికి పడిపోయారు. In a just released CNN-University of New Hampshire poll, DeSantis has dropped 13 points since July's survey. He's now at 10% among likely GOP primary voters, while Vivek Ramaswamy is at 13%, Nikki Haley at 12% and Chris Christie is at 11%. Trump is the first choice at 39%. — Kaitlan Collins (@kaitlancollins) September 20, 2023 ఇది కూడా చదవండి: తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్రౌపది ముర్ముపై కూతురు ఇతిశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు
Presidential Candidate Draupadi Murmu: ‘మా అమ్మ అత్యంత సహనశీలి. కష్టం, విషాదంతో అన్ని తలుపులు మూతబడిన విపత్కర పరిస్థితుల్లో సడలని మానసిక స్థైర్యం కలిగిన సాహసి అమ్మ ద్రౌపది ముర్ము. ఒడిదుడుకులను సహనంతో ఎదురీది దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆమె నాకు సదా మార్గదర్శకం’. ఇదీ... ఎన్డీయే కూటమి తరఫున భారత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము(35) తన తల్లిని ఉద్దేశించి, వెల్లడించిన అభిప్రాయం. ద్రౌపది ముర్ముకు 3 నెలల మనవరాలు ఉంది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు ఆమె కుమార్తె, మనవరాలితో కలిసి, కొద్దిసేపు ముచ్చటించారు. తొలుత ఫోన్ ద్వారా.. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము పేరు ఖరారైన విషయం తొలుత ఫోన్ ద్వారా తెలిసింది. ఆ సమయానికి గ్రామంలో కరెంట్ కోత ఉండడంతో టీవీ ప్రసారాన్ని చూడలేక పోయారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ శుభవార్తను తొలుత తెలియజేయడంతో ఆమె అవాక్కయ్యారు. 2017లో కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వం చివరి క్షణంలో చేజారిపోయింది. ఈసారి కలిసి వస్తుందని ఊహించలేక పోయారు. బరిలో నిలవడం నిజం కావడం ఆనందదాయకంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయినిగా సాధికారతకు శ్రీకారం చుట్టి, తరచూ ప్రజాహిత, సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకొని.. క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు. చదవండి: చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించడానికి వీల్లేదు: కొత్త మార్గదర్శకాలు రెడీ! కౌన్సిలర్ స్థాయి నుంచి అత్యున్నత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా 2సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య రవాణా, మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. 2015లో ఝార్కండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె పనితీరుపై కేంద్రం సంతృప్తికరంగా ఉండటంతో ఆరేళ్లకు పైగా 2021 వరకు అదే బాధ్యత్లో కొనసాగారు. ప్రధాని తొలి సంతకం.. భువనేశ్వర్: భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయ గణతంత్ర కూటమి(ఎన్డీయే) ప్రముఖులు హాజరయ్యారు. తొలి ప్రతిపాదకులుగా ప్రధాని తొలి సంతకం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఎన్డీయే ప్రముఖులతో ఎన్డీయేతర బీజేడీ, వైఎస్సార్ సీపీ ప్రముఖులు నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేయడం విశేషం. ఒడిశాకు చెందిన బీజేపీ ఎమ్మల్యేలు ముర్ము నామినేషన్లపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. సైకత శుభాకాంక్షలు భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ముకు అంతర్జాతీయ సైకతశిల్పి, పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పూరీ సాగర తీరంలో తీర్చిదిద్దిన శైకత శిల్పం.. పలువురిని ఆకట్టుకుంది. చదవండి: షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు! -
రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం.. భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం గెజిట్‌ను విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. భారత దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29 వరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. జులై 18న ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ జరుగుతుంది. Gazette notification issued for 16th Presidential Election today. (Source: ECI) pic.twitter.com/UBy3fNXnur — ANI (@ANI) June 15, 2022 ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఎలా ఎన్నుకుంటారంటే.. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,809 మంది సభ్యులు ఓటు వేయబోతున్నారు. వీరిలో 776 మంది పార్లమెంటు సభ్యులు కాగా... 4,033 మంది రాష్ట్రాల చట్ట సభలకు చెందినవారు. వీరందరి ఓట్ల విలువ 10,86,431. అభ్యర్థి పేరేది? ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో, సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంకోవైపు, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ.. వివిధ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించింది. విపక్షాల తరపున ఆ బాధ్యతను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. -
నేనే గెలిచా.. కాదు నేను!
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో తానే విజయం సాధించానని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించుకున్నారు. చర్చలో బైడెన్ ప్రమాదకరమైన ఎజెండాను తాను బయటపెట్టానని చెప్పుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ డిబేట్ ఆద్యంతం వాడివేడిగా జరిగిన సంగతి తెలిసిందే!. డిబేట్లో తమ అభ్యర్ధే గెలిచినట్లు డెమొక్రాట్లు ప్రకటించుకున్నారు. ఇన్నాళ్లు మీడియా చేయలేని పని తాను చేశానని, బైడెన్ 47 ఏళ్ల రాజకీయ అనైతికతను బయటపెట్టానని ట్రంప్ చెప్పారు. దేశాన్ని నడిపేందుకు బైడెన్ అత్యంత బలహీనమైన వ్యక్తన్నారు. తన ధాటికి తట్టుకోలేక మిగిలిన డిబేట్లను రద్దు చేసుకోవాలని బైడెన్‌కు డెమొక్రాట్లు సూచిస్తున్నారన్నారు. బైడెన్‌ది వామపక్ష ఎజెండా అని, అతను అధ్యక్షుడైతే వ్యవస్థలు నిర్వీర్యం చేస్తాడని విమర్శించారు. మిగిలిన రెండు డిబేట్ల కోసం తాను ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. డిబేట్లలో మార్పులు! యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్లలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తెలిపింది. తాజాగా జరిగిన తొలి డిబేట్లో డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్‌ను మాట్లాడకుండా ట్రంప్ పలుమార్లు అడ్డంపడ్డారు. అనుమాన బీజాలు నాటే యత్నం ఎన్నికల్లో ఓటమి తథ్యమని తెలిసుకొన్న ట్రంప్ ప్రజల్లో ఎన్నికల చట్టబద్ధతపై అనుమాన బీజాలు నాటేందుకు యత్నిస్తున్నారని జోబైడెన్ ఆరోపించారు. తాను ఓడిపోతే ఆ ఎన్నిక చట్టబద్ధం కాదని ట్రంప్ భావిస్తున్నారని, ఇదే అనుమానాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఏఒక్క అధ్యక్షుడు ఇలా చేయలేదన్నారు. మంగళవారం జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్, బైడెన్ హోరాహోరీగా మాటలయుద్ధం చేసుకున్నారు. రెండో డిబేట్ ఈ నెల 15న జరుగుతుంది. -
సెనెటర్ మెక్కెయిన్ కన్నుమూత
న్యూయార్క్: అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, ట్రంప్ బద్ద్ధ విరోధి, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరుపడ్డ సెనెటర్ జాన్ మెక్కెయిన్(81) అనారోగ్యంతో కన్నుమూశారు. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల మనసు గెలుచుకున్న ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం సాయంత్రం 4.28 గంటలకు(భారత కాలమానం ఆదివారం తెల్లవారుజామున) తుదిశ్వాస విడిచారు. మెక్కెయిన్ కోరిక మేరకు వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆయన కుటుంబం శుక్రవారమే ప్రకటించింది. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్ పనిచేసిన కెయిన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు 2017లో బయటపడింది. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్నా ఆరోగ్యం పూర్తి క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘నా హృదయం బద్ధలైంది. 38 సంవత్సరాలు ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. బతికున్నంత కాలం నచ్చినట్లుగానే జీవించారు. మరణం కూడా అంతే.. ఆయనను ప్రేమించినవారు చుట్టుఉండగా.. తాను ఎంతో ఇష్టపడిన చోటే ప్రాణాలు వదిలారు’ అని మెక్కెయిన్ భార్య సిండీ ట్విట్టర్లో తెలిపారు. వియత్నాం యుద్ధంలో నేవల్ అధికారిగా పనిచేసిన కెయిన్ దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించారు. అయినా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలతో బయటపడి అమెరికన్ల ప్రశంసలు అందుకున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్ చేతిలో ఓడిపోగా.. 2008 రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికైనా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు. అంత్యక్రియలకు ట్రంప్ రావద్దు రిపబ్లికన్ సెనేటర్‌గా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరంకుశ నిర్ణయాల్ని ఎండగట్టడంలో మెక్కెయిన్ ఎప్పుడూ ముందుండేవారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రకటనల్ని తీవ్రంగా విమర్శించారు. శరణార్థుల విషయంలో అమెరికా విధానాల్ని తూర్పారపడుతూ ట్రంప్‌కు పక్కలో బల్లెంలా మారారు. తన అంత్యక్రియలకు సైతం రావద్దని ట్రంప్‌కు తన వైఖరిని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు ట్రంప్‌ను ఆహ్వానించడం లేదని ఇప్పటికే కెయిన్ కుటుంబం ప్రకటించింది. మెక్కెయిన్ మృతి పట్ల పార్టీల కతీతంగా సంతాపం వెల్లువెత్తింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి బుష్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. మెక్కెయిన్ మృతికి భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌తో స్నేహానికి పెద్దపీట భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాంక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్ఎన్కు సంపాదకీయం రాస్తూ.. ‘ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా–భారత్ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవో కొన్ని దేశాలకు మాత్రమే ఇంత తక్కువ కాలంలో గొప్ప గౌరవం లభించింది. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని ప్రస్తుతించారు. అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. -
రేపు చెన్నైలో రాష్ట్రపతి అభ్యర్థులు
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార, విపక్షాల అభ్యర్థులు శనివారం చెన్నైలో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ ఉదయం 11 గంటలకు చెన్నైకి చేరుకుని సీఎం ఎడపాడి పళని స్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలను కలవనున్నారు. అలాగే తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను సైతం కలుసుకుని మద్దతు కోరనున్నట్లు తెలుస్తోంది. యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ సాయంత్రం 4 గంటలకు చెన్నైకు చేరుకుని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, స్టాలిన్లను కలువనున్నారు. ఒకేరోజు ఇద్దరు అభ్యర్థులు చెన్నైలో ప్రచారం నిర్వహించనుండడం గమనార్హం.