నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్ | Bobby Jindal asks supporters to help Nikki Haley in her re-election bid | Sakshi
Sakshi News home page

నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్

Published Wed, Aug 28 2013 10:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్

నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్

దక్షిణ కరోలినా గవర్నర్గా మరోసారి ఎన్నికయ్యేందుకు నిక్కీ హేలీకి సహకరించాలని ప్రముఖ కన్జర్వేటివ్ నాయకులను లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కోరారు. తన స్నేహితురాలైన నిక్కీ హేలీ ద్వితీయ పర్యాయం దక్షిణ కరోలినా గవర్నర్ పీఠాన్ని అధిష్టించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన మద్దతుదారులకు బాబీ జిందాల్ ఈ-మెయిల్ సందేశం పంపారు.

41 ఏళ్ల నిక్కీ హేలీ ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్గా కొనసాగుతున్నారు. చిన్న వయసులో అమెరికాలో గవర్నర్ పదవిని చేపట్టిన భారత సంతతి మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు. కాగా, మరోసారి గవర్నర్ పదవిపై గురిపెట్టిన నిక్కీ హేలీ... బాబీ జిందాల్, టెక్సాస్, విస్కాన్సిన్ గవర్నర్లు సమక్షంలో సోమవారం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నిక్కీ హేలీ ప్రచారానికి నిధులు సేకరించేందుకు సిద్ధగా ఉన్నానని ఈ సందర్భంగా బాబీ జిందాల్ ప్రకటించారు. 20 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులిచ్చి సహకరించాలని రిపబ్లికన్లను ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement