వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో అఫైర్ కొనసాగిస్తున్నారని వస్తున్న వదంతుల్ని హేలీ తీవ్రంగా ఖండించారు. విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హేలీతో చాలాసేపు గడుపుతున్నారనీ మైకెల్ వుల్ఫ్ తన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’లో రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన హేలీ తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment