united nations ambassador
-
ఐరాసలో భారత రాయబారిగా హరీశ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీశ్‌ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా సేవలందిస్తున్న హరీష్ త్వరలో యూఎన్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రధాని మోదీ ఒక సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో హరీశ్ నియామకం త్వరగా పూర్తయింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్ జూన్‌లో పదవీవిరమణ చేశాక ఆ పోస్ట్ అప్పటి నుంచీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి రాయబారి నియామక ప్రక్రియను కేంద్రం వేగంగా పూర్తిచేసింది. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్ అధికారి అయిన హరీష్ మూడు దశాబ్దాలుగా విదేశాంగ శాఖ పరిధిలో పలు దేశాల్లో పనిచేశారు. -
ప్రతిభకు సర్కారు పట్టం
సాక్షి అమరావతి : రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న, కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్తె శివలింగమ్మ, టీచర్ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్ కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్ కుమార్తె చంద్రలేఖ.. వీరి కుటుంబాలకు పని ఉంటేనే రోజు గడిచేది.. లేకపోతే పస్తులే. ఇలాంటి వారి గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? అని అనిపించడం సహజం. పైగా.. ఈ కోవకు చెందినవారు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు.. పత్రికలో రాసేటంతగా విషయం ఏముంటుంది అని కూడా అనుకోవచ్చు.. కానీ, చదువులో రాణించి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే వీరు సాధించిన గొప్ప విజయం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన 150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష నిర్వహించగా మొత్తం 30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి పై 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఇప్పుడు వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు ప్రభుత్వ ఖర్చుతో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలపైన, పాఠశాలల అభివృద్ధిపైన మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ పర్యటనలో వీరు అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం సందర్శిస్తారన్నారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లుచేసినట్లు వారు వివరించారు. ఇక ఈ విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. గిరిజన బాలికకు అద్భుత అవకాశం.. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన సామల మనశ్విని తల్లి కృష్ణవేణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన మనశ్విని అమెరికా వెళ్లనున్న పది మంది విద్యార్థుల్లో ఒక్కరిగా నిలిచింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభలో తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. రైతు బిడ్డకు గొప్ప వరం కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మ ల నాలుగో సంతానం శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతి 541 మార్కులతో పాసైంది. బాలిక తండ్రి సోమనాథ్ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శివలింగమ్మ అమెరికా వరకు వెళ్లే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సోమనాథ్ ఎక్కడలేని ఆనందం వ్యక్తంచేశారు. ఐరాస సదస్సుకు రైతుబిడ్డ.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన వంజవాకం నాగరాజు, విజయ దంపతుల రెండో కుమారుడు యోగీశ్వర్. తండ్రి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే రైతు. ఇద్దరి సంతానంలో పాప విద్యశ్రీ ఇంటర్ చదువుతుండగా, కుమారుడు యోగీశ్వర్ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానం సాధించాడు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తమబిడ్డల చదువుకు ఎంతో సహకరించాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేక.. చంద్ర లేఖ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతుకూరి రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె చంద్రలేఖ. రాష్ట్ర విభజనతో కుటంబంతో భద్రాచలం నుంచి ఎటపాకకు వచ్చిన రామారావు చంద్రలేఖను స్థానిక కేజీబీవీలో చదివించారు. ఇటీవల పదో తరగతిలో 523 మార్కులు సాధించి కేజీబీవీ జిల్లా టాపర్‌గా నిలిచి ప్రభుత్వం అందించిన జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ఈ విజయమే ఆమెను ఐక్యరాజ్య సమితికి వెళ్లేలా బాటవేసింది. తల్లి కష్టంతో తల్లడిల్లి.. పూట గడవడం కూడా కష్టమైన ఇంట్లో పుట్టిన షేక్ అమ్మాజాన్ ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. రైతుకూలీ అయిన తల్లి కష్టంచూసి చదువుల్లో రాణించాలనుకుంది. ఐదో తరగతిలోనే వైఎస్సా ర్జిల్లా వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు తెచ్చుకుంది. ఇటీవల టెన్త్‌లో 581 మార్కు లు సాధించి రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యా లు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఐరాస గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరింది. ప్రతిభ చాటిన సెక్యూరిటీ గార్డు బిడ్డ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య గృహిణి. వీరి రెండో కుమార్తె జ్యోత్స్న టెన్త్‌లో 589 మార్కులు సాధించింది. దీంతో పాటు జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతూ అమెరికా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కౌలురైతు కొడుకు ఘనత.. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన జి.గణేష్ అంజనసాయి ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెం గురుకుల పాఠ శాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. తండ్రి గోపి కౌలురైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. కుటుంబానికి చదువు భారం కాకూడదని గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు. 590 మార్కులతో అదరహో.. తండ్రి కూలీ, తల్లి గృహిణి. తండ్రికి పని దొరికితేనే పూటగడిచే పరిస్థితి. తన భవిష్యత్‌ను చదువుల ద్వారా తీర్చిదిద్దుకుని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బలంగా అనుకుంది పసుపులేటి గాయత్రి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివి ఏకంగా 590 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. అమెరికా బృందానికి ఎంపికైంది. మెరిసిన మెకానిక్ కుమార్తె.. విజయనగరం శివారు జమ్మునారాయణపురంలో నివాసముండే అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డి రెండో కుమార్తె రిషితారెడ్డి స్థానిక మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ చదివి 587 మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. ఇప్పుడు అమెరికా వెళ్లే అరుదైన అవకాశం దక్కించుకుంది. నంద్యాల నుంచి అమెరికాకు.. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన విద్యార్థిని సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్, భార్య రామలక్ష్మమ్మ ఇంటివద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో టెన్త్ చదివి 583 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ఐరాసకు వెళ్లే అరుదైన అవకాశం కైవసం చేసుకుంది. -
రష్యా నరమేధం!.. భారత్ స్పందన ఇది
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల నరమేధంపై భారత్ స్పందించింది. బుచా నగరం శవాల దిబ్బగా మారడం, ఉక్రెయిన్ సామాన్యులపై రష్యా సైన్యం అకృత్యాలకు పాల్పడిందంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ పరిణామాలను పలుదేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. రష్యా రాయబారులను తమ తమ దేశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు పలు దేశాలు కూడా ప్రకటించాయి. తాజాగా బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండపై భారత్ స్పందించింది. ఉక్రెయిన్‌లో పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపడం హేయనీయమైన చర్యలని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలని.. అదీ స్వతంత్ర్యంగా ఉండాలన్న డిమాండ్‌కు భారత్ మద్దతు ఉంటుందని ప్రకటించింది. బుచాలో పౌర హత్యల ఇటీవలి నివేదికలు తీవ్రంగా కలచివేశాయి. మేము(భారత్) ఈ హత్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర విచారణకు మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ‘‘అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు.. దౌత్యం మాత్రమే అనుకూలమైన మార్గం’’ అంటూ పేర్కొన్నారాయన. మరోవైపు ఉక్రెయిన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం ఫోన్ చర్చలు జరిపారు. పనిలో పనిగా ద్వైపాక్షిక సంబంధాలూ చర్చకు వచ్చినట్లు సమాచారం. -
ప్రపంచ శాంతి స్థాపనకు భారత్ భారీ సాయం
న్యూయార్క్: ప్రపంచంలో శాంతికాముక దేశం ఏదంటే అందరూ భారత్‌ను చూపిస్తారు. అలాంటి భారతదేశం ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం శాంతి స్థాపనకు విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో శాంతి పెంపొందించేందుకు భారతదేశం భారీ సహాయం ప్రకటించింది. ఏకంగా లక్షా 50 వేల డాలర్లు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ నిధులను ఐక్య రాజ్య సమితికి అందించనున్నట్లు న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్ సమావేశంలో భారత్ తెలిపింది. ప్రపంచంలో శాంతిని పెంపొందించేందుకు ఐక్య రాజ్య సమితి తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే శాంతి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాలు నిధులు ఇస్తుంటాయి. ఈ క్రమంలో భారతదేశం లక్షా 50 వేల డాలర్లు ఇస్తున్నట్లు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత బ్రాండ్ అంబాసిడర్ టి.ఎస్.తిరుమూర్తి ప్రకటించారు. ‘‘శాంతి స్థాపనలో మా దేశం ఎప్పుడు ముందుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో శాంతి స్థాపన కార్యక్రమాలకు మా మద్దతును పెంచుకుంటున్నాం. అందులో భాగంగానే శాంతి స్థాపన నిధికి 2021 సంవత్సరానికి గాను లక్షా 50 వేల డాలర్లు ప్రకటిస్తున్నాం’’ అని న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్ సమావేశంలో తిరుమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగానే త్రిమూర్తి 2020లో శాంతిస్థాపనకు జరిగిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ప్రపంచదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండాలనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఐరాస కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్ కీలకంగా పని చేస్తుంది. అందుకే భారతదేశానికి ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. -
పాక్ ఉగ్ర స్వర్గధామమే: నిక్కీ హేలీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించబోదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధినాయకత్వానికి అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల ఏరివేత విషయమై గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాలు ప్రపంచానికి నాయకత్వం వహించాలని హేలీ ఆకాంక్షించారు. -
‘ట్రంప్‌తో నాకు అఫైర్ లేదు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో అఫైర్ కొనసాగిస్తున్నారని వస్తున్న వదంతుల్ని హేలీ తీవ్రంగా ఖండించారు. విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హేలీతో చాలాసేపు గడుపుతున్నారనీ మైకెల్ వుల్ఫ్ తన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’లో రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన హేలీ తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు. -
హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్ జోక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రాయబారులందరినీ తెగనవ్వించారు. తాను నిర్దేశించిన లక్ష్యాలను గురించి మాట్లాడుతూనే అందులో సున్నిత హాస్యం చేర్చి అందరికీ కొత్తగా దిశా నిర్దేశం చేశారు. అమెరికా తరుపున ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వంగల దేశాలకు విదేశీ రాయబారులుగా పనిచేస్తున్న వారితో ప్రత్యేక సమావేశం అయ్యారు. వైట్ హౌస్‌లో వారికి లంచ్ ఏర్పాటుచేసిన అనంతరం మాట్లాడారు. ముఖ్యంగా పలువురు రాయబారులు ఉన్నప్పటికీ.. నిక్కీ హేలీని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. విదేశాంగ విధానం విషయంలో ఆమె చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ‘ఆమె తన విధిని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా నిక్కీలాగా ఇప్పుడు ఎవరైనా చేస్తారా? ఒక వేళ ఆమెలాగా ఎవరు చేయకపోయినా, ఆమెనే చేయకపోయినా తేలికగా ఆమెను భర్తీ చేయొచ్చు’ అంటూ తెగ నవ్వించారు. అయితే, అలా ఎప్పటికీ తాము చేయబోమని, ఆమె నిజానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.