
చండీగఢ్ కు విచ్చేసిన నిక్కీ హేలీ
చండీగఢ్: భారత సంతతికి చెందిన దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ గురువారం చండీగఢ్ కు వచ్చారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తో ఆమె భేటీ అయ్యారు. ఏరో స్పేస్, ఫార్మా, టూరిజం, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో పంజాబ్ కు సాయపడతామని బాదల్ తో చెప్పారు.
నైపుణ్యభివృద్ధి శిక్షణలో తమ రాష్ట్రం 93 శాతం సక్సెస్ సాధించిందని నిక్కీ హేలీ ఈ సందర్భంగా తెలిపారు. ఏరో స్పేస్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి కల్పనలో తాము సాధించిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా వివరించారు. వివిధ రంగాల్లో కలిసి పనిచేయడం, ఉమ్మడిగా ప్రయోజనం పొందాలని దక్షిణ కరోలినా, పంజాబ్ భావిస్తున్నాయని బాదల్ తెలిపారు.
కాగా, స్వర్ణ దేవాలయంలో నిక్కీ హేలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాలుగు దశాబద్దాలు తర్వాత తమ పూర్వికుల రాష్టానికి వచ్చారామె. ఆమె తండ్రి అమృతసర్ లోని వెర్కా ప్రాంతంలో నివసించే వారు. 1960 దశకంలో ఆయన అమెరికా వలస వెళ్లారు. రెండేళ్ల వయసున్నప్పడు హేలీ పంజాబ్ వచ్చారు.