south carolina governor
-
'మా అమ్మను భారత్లో జడ్జి కానివ్వలేదు'
న్యూయార్క్: భారత్లో తన తల్లి న్యాయశాస్త్రాన్ని చదివి లాయర్ అయినా.. అప్పుడున్న పరిస్థితులు ఆమె న్యాయమూర్తి (జడ్జి)ని కానివ్వలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ గుర్తుచేసుకున్నారు. భారత సంతతికి చెందిన ఆమె బుధవారం ఐరాసలో అంతర్జాతీయ సంబంధాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. 'నేను మహిళలకు పెద్ద అభిమానిని. వారు చేయలేనిదంటూ ఏమీ లేదు. మహిళల పురోగతికి కృషి చేసే ఏ ప్రజాస్వామ్యమైనా.. దానివల్ల అధికంగా లబ్ధి పొందుతుంది' అని పేర్కొన్నారు. భారత్లో తన తల్లి జీవితాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. 'భారత్లో పెద్దగా చదువుకొనే అవకాశం లేకపోయినప్పటికీ మా అమ్మ లా స్కూల్కు వెళ్లి విద్యాభ్యాసం చేసింది. భారత్లో తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం లభించి ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆమె న్యాయమూర్తిగా ధర్మాసనంలో కూర్చోలేకపోయింది. కానీ తన కూతురే ఇప్పుడు సౌత్ కరోలినా గవర్న్ర్ కావడం, ఐరాసకు అమెరికా రాయబారి కావడం ఆమెకు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి' అని నిక్కీ పేర్కొన్నారు. నిక్కీ హెలీ అజిత్ సింగ్ రాంధావ, రాజ్ కౌర్ రాంధావ దంపతులకు జన్మించారు. ఆమె మొదటి పేరు నిమ్రత రాంధావ. 1960లో ఆమె కుటుంబం మొదట కెనడాకు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిపోయింది. నిజానికి, భారత తొలి మహిళ జడ్జిగా జస్టిస్ అన్నా చాందీ కీర్తి గడించారు. ఆమె తొలి మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. 1937లోనే ఆమె ట్రావెన్కోర్ మునసబు (న్యాయాధికారి)గా నియమితులయ్యారు. -
చండీగఢ్ కు విచ్చేసిన నిక్కీ హేలీ
చండీగఢ్: భారత సంతతికి చెందిన దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ గురువారం చండీగఢ్ కు వచ్చారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తో ఆమె భేటీ అయ్యారు. ఏరో స్పేస్, ఫార్మా, టూరిజం, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో పంజాబ్ కు సాయపడతామని బాదల్ తో చెప్పారు. నైపుణ్యభివృద్ధి శిక్షణలో తమ రాష్ట్రం 93 శాతం సక్సెస్ సాధించిందని నిక్కీ హేలీ ఈ సందర్భంగా తెలిపారు. ఏరో స్పేస్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి కల్పనలో తాము సాధించిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా వివరించారు. వివిధ రంగాల్లో కలిసి పనిచేయడం, ఉమ్మడిగా ప్రయోజనం పొందాలని దక్షిణ కరోలినా, పంజాబ్ భావిస్తున్నాయని బాదల్ తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయంలో నిక్కీ హేలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాలుగు దశాబద్దాలు తర్వాత తమ పూర్వికుల రాష్టానికి వచ్చారామె. ఆమె తండ్రి అమృతసర్ లోని వెర్కా ప్రాంతంలో నివసించే వారు. 1960 దశకంలో ఆయన అమెరికా వలస వెళ్లారు. రెండేళ్ల వయసున్నప్పడు హేలీ పంజాబ్ వచ్చారు.