
ఐరాసకు అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె రికార్డుకెక్కారు. 45 ఏళ్ల హేలీతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణం చేయించారు. దేశాధ్యక్షుడు ట్రంప్.. రాయబారిగా హేలీ నియాకాన్ని మంగళవారం ధ్రువీకరించగానే ఆమె దక్షిణ కరోలినా గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించారు. ట్రంప్ కేబినెట్‌లో చేరిన తొలి మహిళగానూ హేలీ నిలిచారు.