![US presidential election 2024: US will have a female president in 2024, says Nikki Haley - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/NIKKI-HAELY.jpg.webp?itok=qdtVQi6n)
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని మొట్టమొదటిసారిగా మహిళ అధిరోహించనున్నారని ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ జోస్యం చెప్పారు. ఆ అవకాశం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు లేదా తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కనుందని ఆమె చెప్పారు.
తాజాగా ఫాక్స్ న్యూస్‌తో నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ ఎన్నికల బరిలో కొనసాగుతానన్నారు. 24న జరిగే సౌత్ కరోలినా ప్రైమరీపైనే తన దృష్టంతా ఉందని నిక్కీ హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అధ్యక్ష బరిలో నిలిచిన ఆ పార్టీకి చెందిన ఏకైక అభ్యర్థి నిక్కీ హేలీ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment