Fox News
-
అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత
వాషింగ్టన్: అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీని నామినేట్ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు సంబంధించి ట్రంప్ యంత్రాంగంలో ఇది రెండో నియామకం కావడం విశేషం. ఫాక్స్‌న్యూస్ హోస్ట్ పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేయడం తెలిసిందే. డఫీ నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయాలు, మీడియా, రియాలిటీ, టీవీ రంగాల్లో విస్తరించిన వైవిధ్యమైన కెరీర్ ఆయన సొంతం. 1990ల చివర్లో ఎంటీవీ ‘ది రియల్ వరల్డ్: బోస్టన్’లో కాస్ట్ మెంబర్‌గా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత ‘రోడ్ రూల్స్: ఆల్ స్టార్స్’లో కనిపించారు. 2010లో విస్కాన్సిన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికవడంతో డఫీ రాజకీయ జీవితం మొదలైంది. 2019లో రాజీనామా చేసి ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్‌గా చేరారు. ప్రస్తుతం ఫాక్స్ బిజినెస్‌లో ‘ది బాటమ్ లైన్’ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2022లో విస్కాన్సిన్ గవర్నర్ పదవిని తిరస్కరించారు. -
మా ఇద్దరిలో ఒకరికి అధ్యక్షపీఠం: నిక్కీ హేలీ!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని మొట్టమొదటిసారిగా మహిళ అధిరోహించనున్నారని ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ జోస్యం చెప్పారు. ఆ అవకాశం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు లేదా తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కనుందని ఆమె చెప్పారు. తాజాగా ఫాక్స్ న్యూస్‌తో నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ ఎన్నికల బరిలో కొనసాగుతానన్నారు. 24న జరిగే సౌత్ కరోలినా ప్రైమరీపైనే తన దృష్టంతా ఉందని నిక్కీ హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అధ్యక్ష బరిలో నిలిచిన ఆ పార్టీకి చెందిన ఏకైక అభ్యర్థి నిక్కీ హేలీ కావడం గమనార్హం. -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!
అమెరికాలో తల్లీకొడుకుల అనుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన కుర్రాడు తన తల్లికి ‘సెక్స్ బానిస’గా ఉంటూ కాలం గడుపుతూ వచ్చాడు. హ్యూస్టన్ పోలీసులు ఈ ఆశ్చర్యకర వివరాలను వెల్లడిస్తూ.. రూడీ ఫరియాస్ ఇంతకాలం తన తల్లితోనే ఉన్నాడని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం మాయమైనప్పుడు రూడీ ఫరియాస్ టీనేజర్. సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచి.. ఫాక్స్ న్యూస్ వెలువరించిన రిపోర్టు ప్రకారం రూడీ ఫరియాస్ మాయవడం గురించి ఒక సామాజిక కార్యకర్త తెలిపిన నేపధ్యంలో ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కార్యకర్త చేస్తున్న ఆరోపణల ప్రకారం అతని తల్లి జెనీ సైన్టనా అబద్ధాలు చెబుతూ, తన కుమారుడిని సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచింది. రూఢీ తల్లి అతనికి మత్తు పదార్థాలు ఇస్తూ అతనితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేది. ‘తరచూ బెదిరించేది’ సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ చేసిన ఆరోపణల ప్రకారం జెనీ సైన్టనా తన కుమారుడితో తండ్రి పాత్ర పోషించాలని డిమాండ్ చేసేది. దీనిని వ్యతిరేకిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమారుడిని బెదిరించేది. అదృశ్యమైన వ్యక్తులను గాలించే హ్యూస్టన్ పోలీసు విభాగానికి చెందిన యూనిట్ అధికారులు సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ సమక్షంలో రూడీ ఫరియాస్, అతని తల్లి జెనీ సైన్టనాలను విచారించారు. భర్తలా వ్యవహరించేందుకు.. ఫాక్స్ 26 హ్యూస్టన్ వెబ్సైట్లో పోస్ట్ అయిన ఒక వీడియోలో ఆ సామాజిక కార్యకర్త విస్తుపోయే వివరాలు వెల్లడించారు. ఆ మహిళ తన కుమారునితో బెడ్ షేర్ చేసుకుంది. కుమారుడిని తన భర్తగా ఉండాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. ఫరియాస్ అదృశ్యమయ్యాడంటూ వార్తలు వచ్చిన సమయంలో అతని వయసు 17 సంవత్సరాలు. అతని తల్లి 2015లో పోలీసులతో.. హ్యూస్టన్‌లోని తమ ఇంటికి దగ్గరలో రెండు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లిన అనంతరం ఫరియాస్ అదృశ్యమయ్యాడని, ఆ శునకాలు ఇంటికి వచ్చినా, అతను తిరిగి రాలేదని ఆమె తెలిపింది. ఇది కూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. కాగా ఆ కుర్రాడు తన తల్లి తీరుకు విసిగిపోయాడు. తన జీవితాన్ని తాను గడపాలనుకున్నాడు. తల్లికి బానిసగా బతుకుతూ ఎంతో విసిగిపోయానని పోలీసులకు తెలిపాడు. ఈ ఉదంతంపై పోలీసులు మాట్లాడుతూ జెనీ తన కుమారునితో ఒక రోజుకు మాత్రమే తండ్రిగా నటించాలని చెప్పి, అతనిని దీర్ఘకాలం పాటు తన సెక్స్ బానిసను చేసుకుందని ఆరోపించారు. తరువాత కుమారుడిని ఎనిమిదేళ్లు దాచివుంచిందన్నారు. ఆమె పోలీసుల కన్నుగప్పి ఇన్నేళ్లూ ఈ వ్యవహారం సాగించిందన్నారు. నిరాకరిస్తున్న పోలీసులు ది ఇండిపెండెంట్ రిపోర్టు ప్రకారం పోలీసులు ఆ తల్లిపై వస్తున్న దుర్వ్యవహార ఆరోపణలను నిజమని నిర్ధారించేందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారులు దీనిపై స్పందిస్తూ ‘కల్పిత రిపోర్టు’తో కూడిన ఆరోపణలపై కోర్టులో కేసు నడవదన్నారు. కాగా న్యూయార్క్ పోస్టును అనుసరించి పోలీసులు ఈ ఇంటర్వ్యూలోని నిజానిజాలపై చర్చించేందుకు నిరాకరించారు. అలాగే వారు ఈ ఇంటర్వ్యూ రిపోర్టు అవాస్తమని కొట్టివేయకపోవడం కూడా విశేషం. ఇది కూడా చదవండి: ట్రంప్ దిగజారితే.. కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు -
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
మైకులో బండబూతు తిట్టి.. ఆపై ఫోన్లో సారీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే బైడెన్లో వేరియేషన్ కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారంతా. సోమవారం ఓ జర్నలిస్టును బండ బూతు తిట్టడం.. అదీ మైక్ సాక్షిగా అందరికీ వినిపించేలా కావడంతో ఘటనపై దుమారం రేగింది. కన్జర్వేటివ్ పార్టీ ప్రొ ఛానెల్ ఫాక్స్ న్యూస్‌లో పని చేస్తున్నాడు పీటర్ డూసీ. అతన్ని బైడెన్ ‘స్టుడిప్ సన్ ఆఫ్ **’ అంటూ తీవ్ర పదజాలంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిట్టేశాడు . అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్ చేసి మరీ బైడెన్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్ కాదని..’ ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. జనవరి 24న వైట్‌హౌజ్‌లో కాంపిటీషన్ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్మీట్లో పీటర్ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో కోపాన్ని అణుచుకోలేక.. వెటకారంగా ‘ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి’ అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే.. ‘వాట్ ఏ స్టుడిప్..’ అంటూ బూతు తిట్టేశాడు. మైక్ ఆన్‌లో ఉంది గమనించని బైడెన్.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. చివరికి బైడెన్ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది. #WATCH | US President Joe Biden appeared to be caught on a hot mic after a journalist asked him a question related to inflation at the end of his press conference (Video Courtesy: C-Span) pic.twitter.com/ZJCP7X3QZS — ANI (@ANI) January 25, 2022 చదవండి: ఏడాదిన్నర చిన్నోడు.. ఫోన్లోనే లక్షా యాభై వేల షాపింగ్ చేశాడు -
జిత్తుల మారి నక్క.. తెలివితేటలు
సాక్షి, కరీంనగర్ : జిత్తుల మారి నక్క.. నక్కకు ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అంటారు పెద్దలు. వ్యవసాయ బావిలో పడ్డ నక్క తెలివితో బయటపడి బతుకు జీవుడా అంటూ పరిగెత్తింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో నక్క వ్యవసాయ బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరింది. రైతులతో పాటు స్థానికులు చూసి అయ్యో పాపం అంటూ నక్కను కాపాడే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా మాట్లాడుకుంటుండగానే నక్క తెలివిని ప్రదర్శించింది. వ్యవసాయ బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటార్‌కు సంబంధించిన వైరును నక్క నోటితో కొరికి కట్ చేసింది. ఆ వైరును నోటితో జిత్తుల మారి నక్క గట్టిగా పట్టుకోగ రైతులు మెల్లిగా లాగారు. రైతుల సహాయానికి నక్క సహకరించి ప్రాణాలతో బయట పడింది. బతుకు జీవుడా అంటూ పక్కనే ఉన్న గుట్టల్లోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం అంటు నక్క తన తెలివిని ప్రదర్శించడాన్ని చూసినవారు నక్క తెలివిని మెచ్చుకుంటూ అక్కడి నుంచి మెల్లిగా ఇంటికి చేరుకున్నారు. -
‘దానికోసం ఓ రాత్రి గడిపేందుకైనా సిద్ధపడతారు’
వాషింగ్టన్ : మహిళా రిపోర్టర్లపై ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత జెస్సీ వాటర్స్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన సమాచారం రాబట్టేందు వారు ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్యానించాడు. సోర్స్‌తో ఓ రాత్రి గడిపేందుకు సిద్ధపడతారని ఫాక్స్ న్యూస్ టాక్ షో ‘ది పైవ్’లో చెప్పుకొచ్చాడు. సినిమాలు, టీవీ షోల్లో చూపుతున్నట్టు నిజ జీవితంలో కూడా అలాంటి పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. తమ సంస్థలో అలీ వాట్కిన్స్ అనే మహిళా రిపోర్టర్ ఇలాంటి పని చేసే నాలుగేళ్లపాటు పొలిటికల్ వార్తల్ని అందరి కన్నా ముందుగా.. గొప్పగా ఇచ్చేదని తెలిపాడు. ఇక అట్లాంటా-జర్నల్ కాన్స్టిట్యూషన్ రిపోర్టర్ కేథీ ష్రగ్స్ జీవితం ఆధారంగా రిచర్డ్ జువెల్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రహస్య సమాచారం కోసం కేథీ ష్రగ్స్ సెక్స్ వ్యాపారం చేసిందనేది కథాంశం. వివాదాస్పద కథాంశంతో వార్తల్లో నిలిచిన రిచర్డ్ జువెల్ సినిమా వాటర్స్ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలోనూ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాటర్స్ తాజా ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై అమెరికన్ టెలివిజన్ వ్యాఖ్యాత ఎస్సీ కప్ ట్విటర్ వేదికగా స్పందించాడు. నిరాధార, నిందారోపణలు చేస్తున్న వాటర్స్ వ్యాఖ్యలు చండాలంగా ఉన్నాయని మండిపడ్డాడు. సొంత సంస్థ మహిళా ఉద్యోగులను అవమాన పరిచిన వాటర్స్ తరపున ఫాక్స్ న్యూస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. -
మా ఆయన యాంకర్‌తో డేటింగ్ చేస్తున్నాడు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫాక్స్ టీవీ హోస్ట్ కింబర్లీ గ్విల్ఫోయెల్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారా? అంటే ఇప్పటివరకు పలు టాబ్లాయిడ్లు ఔననే కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ జూనియర్ భార్య ఈ విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించారు. తొమ్మిది నెలల కిందట భర్త నుంచి విడిపోయి.. ప్రస్తుతం వేరుగా ఉంటున్న వేనెసా ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపారు. తన భర్త కొత్త ప్రియురాలు, ‘ద ఫైవ్’ కార్యక్రమ యాంకర్ కింబర్లీని సమర్థిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ట్రంప్ తనయుడితో ప్రేమాయణం నడిపిస్తున్న కింబర్లీని ఫాక్స్ చానెల్ ఉద్యోగంలోంచి తొలగించాలని, ఆమెను ఉద్యోగంలో కొనసాగించడం సరికాదని ఓ విమర్శకుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తప్పుబడుతూ ప్రచురితమైన ఓ ఆర్టికల్ లింక్‌ను పోస్టు చేసిన వేనెసా.. ‘డాన్‌తో డేటింగ్ చేస్తున్నందుకు ఓ మహిళపై ఎంత దిగజారి దాడి చేస్తున్నారో చూడండి’అంటూ పేర్కొన్నారు. డాన్ అంటే ఇక్కడ జూనియర్ ట్రంప్. సాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ గేవిన్ న్యూసమ్‌ను గతంలో పెళ్లాడిన కింబర్లీతో తన భర్త డేటింగ్ పట్ల తనకేమీ అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. ‘మేం తొమ్మిది నెలల కిందట విడిపోయాం. మా ప్రైవసీని, నిర్ణయాలను పరస్పరం గౌరవించుకుంటున్నాం. పిల్లలను పెంచడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టాం. మీడియా కూడా మా ప్రైవసీని గౌరవించి మా వ్యక్తిగత జీవితాల గురించి దృష్టిపెట్టకపోవడం మంచిది’ అని ఆమె సూచించారు. ఈ ట్వీట్‌ను జూనియర్ ట్రంప్ కూడా రీట్వీట్ చేయడం గమనార్హం. -
తాజా సర్వేలో ట్రంప్ మరింత వెనక్కి
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఆదరణ రోజురోజుకూ తగ్గిపోతోంది. పాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా సర్వే ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటర్ల ఆదరణ పెరిగిందని జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలింది. సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ.. కేవలం ఒక పాయింట్ శాతం ఓటర్ల మెజారిటీ కలిగి ఉన్నారని వెల్లడికాగా.. తాజా సర్వే ఫలితాల్లో మాత్రం హిల్లరీ ఆధిక్యం మూడు పాయింట్ల శాతానికి పెరిగింది. ట్రంప్‌కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇవ్వగా.. హిల్లరీకి 43 శాతం ఓటర్ల మద్దతు ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. మొదటి డిబేట్లో మహిళలపై ట్రంప్ దృక్పథం సరిగా లేదంటూ హిల్లరీ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ డిబేట్ అనంతరం ట్రంప్‌కు జనాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. రాండమ్ శాంపిల్ విధానంలో దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా రిజిష్టర్డ్ ఓటర్ల అభిప్రాయాలతో ఈ సర్వేను నిర్వహించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. -
'ఉల్లిపాయతో కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించారని కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్ట్, ఫాక్స్ న్యూస్ ఛానల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ ఆరోపించారు. ఆయన నిజంగా కన్నీళ్లు పెట్టుకోలేదన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. శాండీ హుక్ స్కూల్ లో 2012లో తుపాకీ కాల్పులకు బలైన 20 మంది చిన్నారులను స్మరించుకుంటూ ఒబామా బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒబామా ఏడవడం నమ్మశక్యంగా లేదని టీవీ చర్చా కార్యక్రమంలో ఆండ్రియా పేర్కొన్నారు. కన్నీళ్లు తెచ్చుకోవడానికి ఆయన ఉల్లిపాయ వాడారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 'ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా నో మోర్ టియర్స్(జాన్సన్ బేబీ షాంపూ బ్రాండ్ నేమ్) కోసం వెతికాను. ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అసలే ఇది అవార్డుల సీజన్' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోహోస్ట్ మిలిసా ఫ్రాన్సిస్ కూడా ఆండ్రియాతో శృతి కలిపింది. అయితే ఒబామాపై ఫాక్స్ న్యూస్ ఛానల్ లో విమర్శలు కొత్త కాదు. గత డిసెంబర్ లో ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎనలిస్ట్ రాల్ప్ పీటర్స్, కంట్రిబ్యూటర్ స్టాసీ డాష్ లను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.