Biden: Openly Scolds Fox News Reporter Later Apologizes, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Biden Video: మైక్‌ ఆన్‌లో ఉండగానే.. రిపోర్టర్‌పై వెటకారంగా బూతు పురాణం

Published Tue, Jan 25 2022 5:30 PM | Last Updated on Tue, Jan 25 2022 6:28 PM

Biden Scold Fox News Reporter Openly Later Apologizes - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే బైడెన్‌లో వేరియేషన్‌ కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారంతా.  సోమవారం ఓ జర్నలిస్టును బండ బూతు తిట్టడం.. అదీ మైక్‌ సాక్షిగా అందరికీ వినిపించేలా కావడంతో ఘటనపై దుమారం రేగింది. 


కన్జర్వేటివ్ పార్టీ ప్రొ ఛానెల్‌ ఫాక్స్‌ న్యూస్‌లో పని చేస్తున్నాడు పీటర్‌ డూసీ. అతన్ని బైడెన్‌ ‘స్టుడిప్‌ సన్‌ ఆఫ్‌ **’ అంటూ తీవ్ర పదజాలంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తిట్టేశాడు . అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్‌ చేసి మరీ బైడెన్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్‌ కాదని..’ ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. 

జనవరి 24న వైట్‌హౌజ్‌లో కాంపిటీషన్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో పీటర్‌ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో కోపాన్ని అణుచుకోలేక.. వెటకారంగా ‘ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి’ అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే.. ‘వాట్‌ ఏ స్టుడిప్‌..’ అంటూ బూతు తిట్టేశాడు. మైక్‌ ఆన్‌లో ఉంది గమనించని బైడెన్‌.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్‌ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్‌ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. చివరికి బైడెన్‌ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది.



చదవండి: ఏడాదిన్నర చిన్నోడు.. ఫోన్‌లోనే లక్షా యాభై వేల షాపింగ్‌ చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement