అమెరికాలో తల్లీకొడుకుల అనుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన కుర్రాడు తన తల్లికి ‘సెక్స్ బానిస’గా ఉంటూ కాలం గడుపుతూ వచ్చాడు. హ్యూస్టన్ పోలీసులు ఈ ఆశ్చర్యకర వివరాలను వెల్లడిస్తూ.. రూడీ ఫరియాస్ ఇంతకాలం తన తల్లితోనే ఉన్నాడని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం మాయమైనప్పుడు రూడీ ఫరియాస్ టీనేజర్.
సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచి..
ఫాక్స్ న్యూస్ వెలువరించిన రిపోర్టు ప్రకారం రూడీ ఫరియాస్ మాయవడం గురించి ఒక సామాజిక కార్యకర్త తెలిపిన నేపధ్యంలో ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కార్యకర్త చేస్తున్న ఆరోపణల ప్రకారం అతని తల్లి జెనీ సైన్టనా అబద్ధాలు చెబుతూ, తన కుమారుడిని సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచింది. రూఢీ తల్లి అతనికి మత్తు పదార్థాలు ఇస్తూ అతనితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేది.
‘తరచూ బెదిరించేది’
సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ చేసిన ఆరోపణల ప్రకారం జెనీ సైన్టనా తన కుమారుడితో తండ్రి పాత్ర పోషించాలని డిమాండ్ చేసేది. దీనిని వ్యతిరేకిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమారుడిని బెదిరించేది. అదృశ్యమైన వ్యక్తులను గాలించే హ్యూస్టన్ పోలీసు విభాగానికి చెందిన యూనిట్ అధికారులు సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ సమక్షంలో రూడీ ఫరియాస్, అతని తల్లి జెనీ సైన్టనాలను విచారించారు.
భర్తలా వ్యవహరించేందుకు..
ఫాక్స్ 26 హ్యూస్టన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ అయిన ఒక వీడియోలో ఆ సామాజిక కార్యకర్త విస్తుపోయే వివరాలు వెల్లడించారు. ఆ మహిళ తన కుమారునితో బెడ్ షేర్ చేసుకుంది. కుమారుడిని తన భర్తగా ఉండాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. ఫరియాస్ అదృశ్యమయ్యాడంటూ వార్తలు వచ్చిన సమయంలో అతని వయసు 17 సంవత్సరాలు. అతని తల్లి 2015లో పోలీసులతో.. హ్యూస్టన్‌లోని తమ ఇంటికి దగ్గరలో రెండు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లిన అనంతరం ఫరియాస్ అదృశ్యమయ్యాడని, ఆ శునకాలు ఇంటికి వచ్చినా, అతను తిరిగి రాలేదని ఆమె తెలిపింది.
ఇది కూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..
కాగా ఆ కుర్రాడు తన తల్లి తీరుకు విసిగిపోయాడు. తన జీవితాన్ని తాను గడపాలనుకున్నాడు. తల్లికి బానిసగా బతుకుతూ ఎంతో విసిగిపోయానని పోలీసులకు తెలిపాడు. ఈ ఉదంతంపై పోలీసులు మాట్లాడుతూ జెనీ తన కుమారునితో ఒక రోజుకు మాత్రమే తండ్రిగా నటించాలని చెప్పి, అతనిని దీర్ఘకాలం పాటు తన సెక్స్ బానిసను చేసుకుందని ఆరోపించారు. తరువాత కుమారుడిని ఎనిమిదేళ్లు దాచివుంచిందన్నారు. ఆమె పోలీసుల కన్నుగప్పి ఇన్నేళ్లూ ఈ వ్యవహారం సాగించిందన్నారు.
నిరాకరిస్తున్న పోలీసులు
ది ఇండిపెండెంట్ రిపోర్టు ప్రకారం పోలీసులు ఆ తల్లిపై వస్తున్న దుర్వ్యవహార ఆరోపణలను నిజమని నిర్ధారించేందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారులు దీనిపై స్పందిస్తూ ‘కల్పిత రిపోర్టు’తో కూడిన ఆరోపణలపై కోర్టులో కేసు నడవదన్నారు. కాగా న్యూయార్క్ పోస్టును అనుసరించి పోలీసులు ఈ ఇంటర్వ్యూలోని నిజానిజాలపై చర్చించేందుకు నిరాకరించారు. అలాగే వారు ఈ ఇంటర్వ్యూ రిపోర్టు అవాస్తమని కొట్టివేయకపోవడం కూడా విశేషం.
ఇది కూడా చదవండి: ట్రంప్ దిగజారితే.. కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!
Published Sat, Jul 8 2023 7:40 AM | Last Updated on Sat, Jul 8 2023 11:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment