వాషింగ్టన్ : అమెరికాలో ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థ యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. థాంప్సన్‌ను హత్య చేసిన నిందితుడి ఫొటోలను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపీడీ) విడుదల చేసింది. అంతేకాదు నిందితుడిని పట్టించిన వారికి భారీ మొత్తంలో ఫ్రైజ్‌మనీ అందిస్తామని తెలిపింది.
గతవారం, మిడ్‌టౌన్‌లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో థాంపన్స్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా థాంపన్స్‌పై దాడి చేసిన నిందితుణ్ని గుర్తించేందుకు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజీల్లో నిందితుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఫొటోలను విడుదల చేశారు.
🚨UPDATE: Below are photos of a person of interest wanted for questioning regarding the Midtown Manhattan homicide on Dec. 4.
The full investigative efforts of the NYPD are continuing, and we are asking for the public's help—if you have any information about this case, call the… https://t.co/U4wlUquumf pic.twitter.com/243V0tBZOr— NYPD NEWS (@NYPDnews) December 8, 2024
ఆ ఫొటోల్లోని ఒక ఫ్రేమ్‌లో థాంప్సన్‌ను హత్య చేసిన అనంతరం ఓ ట్యాక్సీలో తాపీగా కూర్చున్నాడు. రెండో ఫ్రేమ్‌లో బ్లాక్ డౌన్ జాకెట్ ధరించి వీధిలో నడుచుకుంటూ వస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వాటిల్లో ఒకటి అనుమానితుడు కెమెరాను నేరుగా చూస్తూ, టాక్సీ డ్రైవర్‌తో విండో ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. హిల్టన్ హోటల్ వెలుపల థాంపన్స్ జరిగిన తర్వాత అనుమానితుడు సెంట్రల్ పార్క్ సమీపంలో టాక్సీ తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఫోటోల విడుదల అనంతరం, పోలీసు కమిషనర్ జెస్సికా టిస్చ్ మాట్లాడుతూ.. ఫొటోల్లోని నిందితుడి గురించిన సమాచారం అందిస్తే ఎఫ్‌బీఐ 50వేల డాలర్లు బహుమతిని అందిస్తుంది. ఎన్‌వైపీడీ అదనంగా మరో 10వేల డాలర్లు బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించారు. నిందితుడు దేశం వదిలి పారిపోకుండా సరిహద్దుల్లో పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment