న్యూయార్క్/సియాటెల్: అమెరికాలోని సియాటెల్‌లో గతేడాది తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23) పోలీసు వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. ఆమెకు పెద్దగా విలువేమీ లేదనేలా డేనియల్ ఆడెరర్ అనే పోలీసు అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అవి జాహ్నవి కుటుంబానికి ఎంతో వేదన కలిగించి ఉంటాయని దీనిపై విచారణ చేపట్టిన అధికారి స్యూ రాహ్‌ర్ అన్నారు.
అడెరర్ అమానవీయ వైఖరి పోలీసు వృత్తికే కళంకం తెచ్చిపెట్టిందన్నారు. ‘‘ఇలాంటి అధికారిని ఇంకా కొనసాగనీయడం మొత్తం పోలీసు విభాగానికే అవమానకరమవుతుంది. అందుకే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు అతడిని విధుల నుంచి తొలగిస్తున్నాం’ అని ప్రకటించారు. కారును వేగంగా నడిపిన మరో అధికారి కెవిన్ డేవ్‌పై నేరారోపణలను నమోదు చేయలేమంటూ కింగ్ కౌంటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో స్పష్టం చేశారు. అయితే, ఈ నేరం కింద డేవ్‌కు 5 వేల డాలర్ల జరిమానా విధిస్తూ సియాటెల్ సిటీ అటార్నీ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment