మా ఆయన యాంకర్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు! | Donald Trump Jr Is Dating Fox News Host, Wife tweets | Sakshi
Sakshi News home page

Jun 16 2018 9:26 AM | Updated on Jun 16 2018 9:56 AM

Donald Trump Jr Is Dating Fox News Host, Wife tweets - Sakshi

టీవీ హోస్ట్‌ కింబర్లీతో జూనియర్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఫాక్స్‌ టీవీ హోస్ట్‌ కింబర్లీ గ్విల్‌ఫోయెల్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నారా? అంటే ఇప్పటివరకు పలు టాబ్లాయిడ్‌లు ఔననే కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్‌ జూనియర్‌ భార్య ఈ విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించారు. తొమ్మిది నెలల కిందట భర్త నుంచి విడిపోయి.. ప్రస్తుతం వేరుగా ఉంటున్న వేనెసా ట్రంప్‌ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపారు. తన భర్త కొత్త ప్రియురాలు, ‘ద ఫైవ్‌’  కార్యక్రమ యాంకర్‌ కింబర్లీని సమర్థిస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.

ట్రంప్‌ తనయుడితో ప్రేమాయణం నడిపిస్తున్న కింబర్లీని ఫాక్స్‌ చానెల్‌ ఉద్యోగంలోంచి తొలగించాలని, ఆమెను ఉద్యోగంలో కొనసాగించడం సరికాదని ఓ విమర్శకుడు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ తప్పుబడుతూ ప్రచురితమైన ఓ ఆర్టికల్‌ లింక్‌ను పోస్టు చేసిన వేనెసా..  ‘డాన్‌తో డేటింగ్‌ చేస్తున్నందుకు ఓ మహిళపై ఎంత దిగజారి దాడి చేస్తున్నారో చూడండి’అంటూ పేర్కొన్నారు. డాన్‌ అంటే ఇక్కడ జూనియర్‌ ట్రంప్‌. సాన్‌ఫ్రాన్సిస్కో మేయర్‌ గేవిన్‌ న్యూసమ్‌ను గతంలో పెళ్లాడిన కింబర్లీతో తన భర్త డేటింగ్‌ పట్ల తనకేమీ అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. ‘మేం తొమ్మిది నెలల కిందట విడిపోయాం. మా ప్రైవసీని, నిర్ణయాలను పరస్పరం గౌరవించుకుంటున్నాం. పిల్లలను పెంచడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టాం. మీడియా కూడా మా ప్రైవసీని గౌరవించి మా వ్యక్తిగత జీవితాల గురించి దృష్టిపెట్టకపోవడం మంచిది’ అని ఆమె సూచించారు. ఈ ట్వీట్‌ను జూనియర్‌ ట్రంప్‌ కూడా రీట్వీట్‌ చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement