
వాషింగ్‌టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినట్టు సమాచారం. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ పేరు మారుమోగింది. హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా కూడా పనిచేశారు.
కాగా, అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఓవల్‌లోని కార్యాలయంలో తన స్నేహితురాలు నిక్కీ హేలీతో కలిసి ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ ట్విట్ చేశారు.
Big announcement with my friend Ambassador Nikki Haley in the Oval Office at 10:30am.
— Donald J. Trump (@realDonaldTrump) October 9, 2018