అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం | indian women killed car skips us highway flies over bridge land trees | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం

Published Sat, Apr 27 2024 2:00 PM | Last Updated on Sat, Apr 27 2024 2:30 PM

indian women  killed car skips us highway flies over bridge land trees

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ  ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని వీరు  ప్రయాణిస్తున్న కారు  హైవేమీదనుంచి, వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే  మరణించారు. చనిపోయిన వారిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్ , మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు.    

మితిమీరిన వేగంతో  గ్రీన్‌విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి  లేచి, అనంతరంఅదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. కారు ముక్కలైన తీరు చెట్టుపై కారు ఇరుక్కున్న వైనం వేగానికి  అద్దం పడుతోందని తెలిపారు. 

కారులోని క్రాష్‌  డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్‌ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు, దితర  అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు  చేపట్టాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement