succumbed
-
అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీదనుంచి, వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్ , మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. మితిమీరిన వేగంతో గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి లేచి, అనంతరంఅదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. కారు ముక్కలైన తీరు చెట్టుపై కారు ఇరుక్కున్న వైనం వేగానికి అద్దం పడుతోందని తెలిపారు. కారులోని క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు, దితర అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. -
తేనెటీగల దాడి.. టాంజానియాలో వరంగల్ కౌలు రైతు మృతి
సాక్షి,వరంగల్: పొట్టకూటి కోసం దేశంకాని దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. టాంజానియాలో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు పడకంటి బ్రహ్మచారి తేనేటీగలు దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ బ్రహ్మచారి ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. మృతుని స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేట. ఉన్న ఊరిలో బతుకుభారమై పరాయి దేశానికి వెళ్లిన బ్రహ్మచారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడని స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. -
చైనాలో తమిళనాడు వైద్య విద్యార్థి మృతి.. కరోనానే కారణం?
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. గత ఐదేళ్లుగా చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబం తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు భారత్‌లోని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షేక్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం చైనాకు వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా భారత్ తిరిగివచ్చిన అతను 20 రోజుల క్రితమే(2022 డిసెంబర్ 11)న తిరిగి చైనాకు వెళ్లాడు. 8 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈశాన్య చైనాలోని హెయిలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అతడిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అనారోగ్యంతో తమ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది ఆ కుటుంబం. అలాగే.. తమకు సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బస్తీ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బైటపడినప్పటికీ, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. లక్నో నుండి జార్ఖండ్‌కు వెళుతున్నప్పుడు పురైనా క్రాసింగ్ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న కంటైనర్ టక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు కింద నుండి కారును బయటకు తీయడానికి రెస్క్యూ అధికారులు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చిందంటేనే ప్రమాద తీవ్రను అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు స్పాట్లోనే మరణించారు. కారు డ్రైవర్, మరో అయిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామనీ, అయితే బాలిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డ్రైవర్ అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారిని తెలిపారు. చనిపోయిన వారిని అబ్దుల్ నజీజ్, నర్గీస్, ఆనం, సిజ్రా, టుబాగా గుర్తించారు. మరోవైపు ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
భారీగా చెలరేగిన మంటలు: 42 మంది ఆహుతి
అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf — sebastian usher (@sebusher) August 10, 2021 the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s — ♠️ (@cicegimeda) August 10, 2021 Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF — Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021 -
కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్-19తో మృతి చెందిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 కోట్లను సాయంగా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూ ర్వకంగా సమాధానమిచ్చారు. కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను గుర్తించి, సాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అందిన దరఖాస్తులకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం(జేడబ్ల్యూఎస్) నిబంధనలకు లోబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. చదవండి: Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
కరోనా మృత్యుపాశం: కార్మికుడు బలి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ కార్మికుల పాలిట మృత్యు పాశమవుతోంది. తాజాగా మరో విషాధ గాథ వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన వలసకార్మికుడు సఘీర్ అన్సారీ(26) ఢిల్లీ నుంచి బిహార్‌లోని తన స్వస్థలమైన తూర్పు చంపారన్‌కు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎలాగైనా సొంత ఊరికి చేరుకోవాలనే తపనతో 1000 కిలోమీటర్ల దూరాన్ని సైతం సైకిల్‌పై గెలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే మృత్యువు మింగేస్తుందని ఊహించ లేకపోయాడు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా పని దొరకక పోవడంతో తన సహచరులు ఏడుగురితో కలిసి మే 5న తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అన్సారీ. అయిదురోజుల తరువాత సగం దూరం లక్నో చేరుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అల్పాహారం (అటుకులు) తినేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఇంతలో అతివేగంతో వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సఘీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే అక్కడ వున్న ఒక చెట్టు ఇతరులను రక్షించింది. మొదట కొంత డబ్బు ముట్టజెప్పేందుకు బేరాలాడిన కారు డ్రైవరు ఆ తరువాత నిరాకరించి అక్కడినుంచి ఉడాయించాడు. స్థానికఎన్జీవోసహాయంతో సఘీర్ అన్సారీ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించారు అతడి స్నేహితులు. బాధితునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితి ఉపాధిని దెబ్బతీయడంతో లక్షలాది మంది వలస కార్మికులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. వీరిని స్వగ్రామాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, వేలాదిమంది ఇప్పటికీ సైకిళ్లపైనో, కాలిబాటనో ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నఘటనలు నమోదవుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గడ్‌కు చెందిన భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైల్వే ట్రాక్ ఘటనలో16 మంది వలస కార్మికులు మరణించిన ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. -
కోతిపై యాసిడ్ దాడి..50వేల రివార్డు
ముంబై: రకరకాల కారణాలతో ప్రత్యర్థులపై యాసిడ్ దాడి చేయడం మనకు తెలిసిందే. కానీ నోరులేని జీవిపై యాసిడ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నాలుగురోజుల క్రితం ముంబై సమీపంలో యాసిడ్ గాయాలతో కనిపించిన ఓ కోతిని వన్యప్రాణ సంరక్షణ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ఆ కోతి మంగళవారం చనిపోయింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి 50 వేల రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర గాయాలతో ఓ కోతి హృదయక విదారక స్థితిలో థానేలోని అటవీ ప్రాంతంలో గత శుక్రవారం కనిపించింది. దీన్ని గమనించిన వైల్డ్ లైఫ్ సంక్షేమ సంఘం అటవీశాఖకు సమాచారం అందించడంతో ఆ వానరాన్ని ఆసుపత్రికి తరలించారు. కోతిపై గాయాలను పరిశీలించిన వైద్యులు ఇది యాసిడ్ దాడి అని తేల్చారు. యాసిడ్ వల్లే పొట్ట, కాళ్లు, ముఖ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయని గుర్తించారు. సుమారు నాలుగురోజులపాటు చికిత్స అందించినా వానరాన్ని కాపాడలేకనపోయారు. గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి మరింత తీవ్రం కావడంతో మృతి చెందింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ద హ్యమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు దీనికి బాధ్యులైన వ్యక్తులను పట్టిచ్చిన వారికి భారీ బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.