సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బస్తీ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బైటపడినప్పటికీ, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. లక్నో నుండి జార్ఖండ్‌కు వెళుతున్నప్పుడు పురైనా క్రాసింగ్ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న కంటైనర్ టక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు కింద నుండి కారును బయటకు తీయడానికి రెస్క్యూ అధికారులు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చిందంటేనే ప్రమాద తీవ్రను అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు స్పాట్‌లోనే మరణించారు. కారు డ్రైవర్, మరో అయిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామనీ, అయితే బాలిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డ్రైవర్ అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారిని తెలిపారు. చనిపోయిన వారిని అబ్దుల్ నజీజ్, నర్గీస్, ఆనం, సిజ్రా, టుబాగా గుర్తించారు.
మరోవైపు ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment