rammed
-
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బస్తీ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బైటపడినప్పటికీ, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. లక్నో నుండి జార్ఖండ్కు వెళుతున్నప్పుడు పురైనా క్రాసింగ్ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న కంటైనర్ టక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు కింద నుండి కారును బయటకు తీయడానికి రెస్క్యూ అధికారులు క్రేన్ను ఉపయోగించాల్సి వచ్చిందంటేనే ప్రమాద తీవ్రను అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు స్పాట్లోనే మరణించారు. కారు డ్రైవర్, మరో అయిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామనీ, అయితే బాలిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డ్రైవర్ అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారిని తెలిపారు. చనిపోయిన వారిని అబ్దుల్ నజీజ్, నర్గీస్, ఆనం, సిజ్రా, టుబాగా గుర్తించారు. మరోవైపు ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
హైవేపై ఢీకొన్న 30 వాహనాలు!
-
హైవేపై ఢీకొన్న 30 వాహనాలు!
జైపూర్: దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని వణికిస్తుంది. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జైపూర్- ఆగ్రా రహదారిపై ఆదివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో.. ఒకరు మృతి చెందగా సుమారు 20 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి మెడికల్ సేవలు అందించినట్లు జైపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. పొగమంచు మూలంగా ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1 dead as almost 30 vehicles rammed into each other on Jaipur- Agra Highway due to fog; 28 injured out of which 3 are critical. — ANI (@ANI_news) 29 January 2017 -
బోయిన్ పల్లిలో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బోయిన్ పల్లిలో అదుపుతప్పి చుట్టుపక్కలవారిని భయబ్రాంతులకు గురి చేస్తూ బుక్ స్టాల్లోకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా.. లేక అతివేగమే కారణమా లేక మరో వాహనాన్ని తప్పించబోయి అలా జరిగి ఉంటుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. -
బోయిన్ పల్లిలో కారు బీభత్సం
-
ఆటో-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
భోగాపురం: ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. దీంతో బైక్ మీద వస్తున్న చిన్నా(37), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 108 సాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. -
బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి
కదిరి: అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. బళ్లారికి చెందిన ఓ కుటుంబం అక్కడి నుంచి రాయచోటికి కారులో బయలుదేరింది. పట్నం గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరీశిలించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న డీసీఎం-క్లీనర్ మృతి
రాయపర్తి(వరంగల్): మోరిపిరాయల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి తీవ్రంగా గాయపడి, అసస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బరువైన 'బుల్లెట్' ప్రాణం తీసింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది . ఒకవైపు అతి వేగం, మరోవైపు బరువైన వాహనం మానిక్ గౌర్(32) ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని శంకర్ విహార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్షులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రేజీ బైక్ బుల్లెట్ పై రైడ్ అంటే యువకులకు మహా ఉత్సాహం. ఈ ఉత్సాహంలోనే మానిక్ మితిమీరిన వేగంతో బుల్లెట్ పై వెడుతూ పక్కనే ఉన్న టెంపోను ఢీకొట్టాడు. అక్కడితో అది ఆగలేదు.. కొన్నిమీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి పోవడంతో మంటలు చెలరేగాయి. బండి పూర్తిగా అదుపు తప్పి, అతను కిండపడిపోయాడు. అతనిపై బుల్లెట్ పడిపోయింది. పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మానిక్ మంటల్లో చిక్కుకు పోయాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు అతణ్ని ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. సుమారు 200 కిలోల వెయిట్ వున్న వాహనాన్ని లేపలేకపోయాడని , మంటలు బాగా వ్యాపించడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
ఆదుకోవాల్సిందే...మింగేసింది
బీహార్ : అత్యవసర సమయాల్లో ఆదుకొని ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే రాకాసిలా దూసుకొస్తే .... బీహార్లోని మంగర్ గ్రామంలో అదే జరిగింది. మృత్యుదేవతలా దూసుకొచ్చిన ఓ అంబులెన్స్ ఇద్దర్ని పొట్టన బెట్టుకుని మరో ఏడుగుర్ని తీవ్రంగా గాయపర్చి బీభత్సం సృష్టించింది. గురువారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. పోలీసుల సమాచారం ప్రకారం... భగల్ప పూర్ నుంచి వస్తున్న ఆంబులెన్స్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. గోడల్ని బద్దలు కొట్టుకుంటూ వేగంగా దూసుకువెళ్ళిన ఈ ప్రమాదంలో 22 సంవత్సరాల ఝునియా దేవితో పాటు అయిదేళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక సదర్ అసుపత్రికి తరలించామని ఎస్పీ బరున్ కుమార్ సిన్హా తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.