
బోయిన్ పల్లిలో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బోయిన్ పల్లిలో అదుపుతప్పి చుట్టుపక్కలవారిని భయబ్రాంతులకు గురి చేస్తూ బుక్ స్టాల్లోకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.
అయితే, ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా.. లేక అతివేగమే కారణమా లేక మరో వాహనాన్ని తప్పించబోయి అలా జరిగి ఉంటుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.