Book Stall
-
పెళ్లిళ్లలో ఇప్పుడిదే ట్రెండ్ భయ్యా.. హాలులోకి ప్రవేశించే ప్రదేశంలో
వివాహ వేడుకల్లో హంగు, ఆర్భాటాలు ప్రదర్శించడం చూస్తుంటాం.. కానీ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల వివాహ వేడుకల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి మండపంలో మహనీయుల పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంబేడ్కర్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే, భగత్‌సింగ్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రముఖుల సాహిత్య రచనలకు సంబంధించిన పుస్తకాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యే బంధుమిత్రులు ఈ పుస్తక ప్రదర్శనను వీక్షించి, తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుంటున్నారు. కొందరు ఈ పుస్తకాలను వధూవరులకు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. ఫంక్షన్‌హాలులోకి ప్రవేశించే ప్రదేశంలో ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా పుస్తకాలను వీక్షిస్తున్నారు. సాక్షి, సంగారెడ్డి: అందోల్ పట్టణానికి చెందిన తలారి లక్ష్మణ్ రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తన కూతురు వివాహాన్ని బౌద్ధమత ఆచారం ప్రకారం ఘనంగా నిర్వహించిన లక్ష్మణ్, ఈ వివాహ వేడుకలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సమతా సైనిక్ సేవాదళ్‌లో పనిచేస్తున్న జహీరాబాద్‌కు చెందిన ఎర్రోళ్ల విష్ణు తన వివాహ వేడుకలో కూడా ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాడు. అందోల్‌కు చెందిన ఆది తక్షక్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా కూడా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయించారు. ఆసక్తి పెరిగేలా.. సోషల్ మీడియా ప్రభావంతో చాలా మందిలో పుస్తక పఠనాసక్తి తగ్గిపోతోంది. పుస్తక ప్రదర్శనలకు గానీ, బుక్ స్టాల్‌కు గానీ వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆదర్శభావాలు ఉన్న వారు వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా పుస్తకాలపై మళ్లీ ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. వివాహ వేడుకలకు వందలు, కొన్ని చోట్ల వేలల్లో హజరవుతుంటారు. ఈ ప్రదర్శనలతో కొందరిలోనైనా పుస్తకాల పట్ల ఆసక్తి కలిగేలా చేసినా చాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పుస్తకం ఆయుధం లాంటిది పుస్తకం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఒక ఆయుధం లాంటిది. వివాహ వేడుకలకు బంధుమిత్రులు, సన్నిహితులు.. అందరూ హాజరవుతారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా వారిలో మహనీయుల పుస్తకాలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. అందుకే నా కూతురు వివాహంలో ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను. – తలారి లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అందోల్, సంగారెడ్డి జిల్లా నా మ్యారేజీ నుంచే మార్పురావాలని సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత పుస్తకాలు చదవడం మానేశారు. మహనీయుల పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. సన్మార్గంలో నడిచేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటి పుస్తక ప్రదర్శన కల్చర్ పెరగాలని కోరుకుంటున్నాను. నా మ్యారేజీ నుంచే ఈ మార్పు రావాలని భావించి పెళ్లిలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను. – ఎర్రోళ్ల విష్ణు, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా ఫోన్ చేస్తే వెళ్లి స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం బుక్‌స్టాల్ ఏర్పాటు చేయాలని ఎవరైనా 9848397857 నంబర్‌కు ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి ఏర్పాటు చేస్తున్నాము. మహనీయుల జీవిత చరిత్రలు, సాహిత్య రచనలు.. ఇలా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతాము. వివాహాలతోపాటు, ఇతర శుభకార్యాలకు చెప్పినా వెళ్లి పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం. – నగేశ్, పుస్తక ప్రదర్శన నిర్వాహకులు, సంగారెడ్డి -
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ స్టాల్లో అగ్ని ప్రమాదం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): ముద్ర రుణం తీసుకుని నిర్వహిస్తున్న ఓ నిరుద్యోగి బుక్‌స్టాల్ శుక్రవారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా కాలిబూడదైంది. సాగర్‌నగర్ వుడా కాలనీ మెయిన్ రోడ్డులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దూది రామకృష్ణ అనే నిరుద్యోగి ప్రధానమంత్రి ముద్ర యోజన ప£ýథకం కింద రూ.50 వేలు రుణం తీసుకొని ఒక బుక్‌స్టాల్ అండ్ స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గురువారం రాత్రి యథావిధిగా దుకాణం షెటర్ దించి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ మీటరు వద్ద షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు చెలరేగి బుక్స్, కాగితాలకు అంటుకున్నాయి. పొగలు బయటకు రావడంతో పక్కనే ఉన్న నివాసితులు అప్రమత్తమై షాపు యజమాని రామకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే ఆయన షాపు వద్దకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. వారు వచ్చేసరికే షాపు లోపల నోట్‌బుక్స్, విలువైన స్టేషనరీ, జిరాక్స్ మిషన్, రూ.11వేల నగదు కాలిబూడదైంది. గంట తర్వాత వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చినగదిలి తహసీల్దార్ ఎస్.భాస్కరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్ఐ యసేశ్వని, వీఆర్వో సందర్శించి ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. -
బుక్‌స్టాల్ ప్రారంభం
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని వాణిజ్యభవన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతిబుక్‌స్టాల్‌ను బుధవారం ఏపీజీవీబి బ్యాంకు మేనేజర్ శ్రీకిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సందీప్, కోతి గోపాల్‌రెడ్డి, దుకాణం యజమాని చింత సైదులు, ఎడవెల్లి రాము, చింత వెంకన్న, శ్రీను, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. æశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాసరావు, సృజన, భట్టు శివాజీ, బొమ్మగాని శ్రీనివాస్, పుట్టపాక శ్రీనివాస్, కోటయ్య, సిరపంగి నాగరాజు, కొండల్, లతీఫ్, రాంరెడ్డి, అంతయ్య, దోరెపల్లి శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బోయిన్ పల్లిలో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బోయిన్ పల్లిలో అదుపుతప్పి చుట్టుపక్కలవారిని భయబ్రాంతులకు గురి చేస్తూ బుక్ స్టాల్లోకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా.. లేక అతివేగమే కారణమా లేక మరో వాహనాన్ని తప్పించబోయి అలా జరిగి ఉంటుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. -
బోయిన్ పల్లిలో కారు బీభత్సం
-
బుక్‌స్టాల్ బుగ్గిపాలు
నగరం నడిబొడ్డున ఘోరం జరిగిపోయింది. వెల కట్టలేని నష్టం వాటిల్లింది. అపురూప పుస్తక సంపద అగ్నికి ఆహుతైంది. ఏటేటా కొనుగోలు చేసి కూడబెట్టిన కొత్త, పాత పుస్తకాలు ఒక్క రాత్రిలో భస్మమయ్యాయి. 30 ఏళ్ల కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే దుకాణ యజమాని జుబేర్ విలవిలలాడాడు. ప్రమాద తీవ్రతను తట్టుకోలేక సంఘటన స్థలం వద్దే కుప్పకూలాడు. హన్మకొండ చౌరస్తా : హన్మకొండ చౌరస్తాలో జుబేర్ బుక్‌స్టాల్ బుగ్గిపాలైంది. అగ్నికీలలు ఎగిసిపడడం, పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమా రు రూ. 5 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. బుక్‌స్టాల్ యజమాని జుబేర్ సన్నిహితుడు నయిమోద్దీన్, స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండ చౌరస్తాలో ప్రఖ్యాతిగాంచిన జుబేర్ బుక్‌స్టాల్ యజమాని జుబేర్ రోజూ లాగే శనివారం సిబ్బందిని పంపిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తాళం వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటల సమయంలో ఆ బుక్‌స్టాల్ నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికు లు జుబేర్ కు ఫోన్లో సమాచారం అందించారు. విషయం తెలియగానే ఆందోళనగా దుకాణానికి చేరుకున్న జుబేర్ హన్మకొండ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది షట్టర్ తెరవగానే అప్పటికే మంటలు దుకాణమంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, పెద్దపెద్ద మంటలతో దుకాణం కాలిపోవడం కనిపించింది. దీంతో ఒక్క ఫైరింజన్ సరిపోదని భావించి మరో రెండింటిని తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వరకు చల్లారని మంటలు.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు ఫైరింజన్లు, మున్సిపాలిటీ ట్యాంకర్లతో సిబ్బంది నిర్విరామంగా మంటలార్పుతూనే ఉన్నారు. దుకాణానికి మూడు దిక్కులా జేసీబీతో పగులగొట్టి లోపలి కి వెళ్లిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టపడ్డారు. రెండంతస్తులు మొత్తం పుస్తకాలతో నిండి ఉండడంతో మంటలు సులువుగా వ్యాపించాయి. దట్టమైన పొగలు హన్మకొండ చౌరస్తా అంతా వ్యాపించా యి. వేడికి తట్టుకోలేని భవనం మొత్తం పగుళ్లుబారింది. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని భావించారు. వెల కట్టలేని పుస్తకాలు, కూలిపోయిన భవనంతో కలిపి సుమారు. 5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. కాలిపోయిన కాగితాలు గాలిలో ఎగురుతూ హన్మకొండలో మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు, రోడ్లపై పడ్డాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఫైరింజన్‌తో నీళ్లు కొడు తూ మంటలు ఆర్పుతూనే ఉన్నారు. రెండు జిల్లాల పుస్తక కేంద్రం.. వరంగల్‌తోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు పుస్తకాల కోసం జుబేర్ బుక్‌స్టాల్ కు వస్తుండేవారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయలేని పేదవిద్యార్థులకు ఇక్కడ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు తక్కువ ధరకు లభించేవి. అంతేకాదు జుబేర్లో దొరకని పుస్తకమంటూ ఉండదంటే అతిశయోక్తికాదు. ఆ నమ్మకంతోనే వచ్చే విద్యార్థులకు పుస్తకాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ లాభానికి అమ్మి వారి అభిమానాన్ని జుబేర్ చూరగొన్నారు. అందరితో కలి విడిగా ఉండే ఆయనకు సౌమ్ముడిగా పేరుంది. సేవాభావంతో పేదలకు ఉచితంగా పుస్తకాలం దించే ఆయన దుకాణం కాలుతుందని తెలుసుకున్న అనేక మంది సంఘటన స్థలానికి చేరుకు ని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు చోట్ల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వర కు తండోపతండాలుగా తరలివచ్చి చూశారు. డబ్బాగా ప్రారంభమై.. రెండంతస్తుల దుకాణంగా ఎదిగి.. మొదట కొన్ని పుస్తకాలతో చౌరస్తాలో ఒక డబ్బాలో పుస్తకాలు అమ్మిన జుబేర్ కష్టపడి నిజాయితీగా పెకైదిగాడు. సుమారు 50 మందికిపైగా యువకులకు ఉపాధి కల్పించా డు. 30 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న తన పుస్తకగని అగ్నికి ఆహుతి కావడంతో సంఘటన స్థలం వద్దే కుప్పకూలిపోయాడు. షాక్‌కు గురై ఆస్పత్రిపాలైన జుబేర్ తేరుకున్నాక సమాచారం సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం షార్ట్సర్య్కూటా ? కాదా ? అనే అంశంపై విచారణ చేస్తామని తెలిపారు.