
హైవేపై ఢీకొన్న 30 వాహనాలు!
జైపూర్: దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని వణికిస్తుంది. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జైపూర్- ఆగ్రా రహదారిపై ఆదివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సుమారు 30 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో.. ఒకరు మృతి చెందగా సుమారు 20 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి మెడికల్ సేవలు అందించినట్లు జైపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. పొగమంచు మూలంగా ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
1 dead as almost 30 vehicles rammed into each other on Jaipur- Agra Highway due to fog; 28 injured out of which 3 are critical.
— ANI (@ANI_news) 29 January 2017