న్యూఢిల్లీ: కోవిడ్-19తో మృతి చెందిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 కోట్లను సాయంగా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూ ర్వకంగా సమాధానమిచ్చారు.
కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను గుర్తించి, సాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అందిన దరఖాస్తులకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం(జేడబ్ల్యూఎస్) నిబంధనలకు లోబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు.
చదవండి: Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ
Comments
Please login to add a commentAdd a comment