
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు.
‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు.
#savenallamala pic.twitter.com/ytsPoP2kuL
— Sekhar Kammula (@sekharkammula) August 27, 2019