డీఏవీ స్కూల్‌ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్‌ కమ్ముల | Director Sekhar Kammula Tweet On DAV School Student Molestation | Sakshi
Sakshi News home page

Shekar Kammula: డీఏవీ స్కూల్‌ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్‌ కమ్ముల

Oct 22 2022 1:03 PM | Updated on Oct 22 2022 1:18 PM

Director Sekhar Kammula Tweet On DAV School Student Molestation - Sakshi

హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదన్నారు. 

చదవండి: మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్‌

‘డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమైన సంఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నా. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతాం’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement